Site icon NTV Telugu

Kiran Abbavaram: సీమ కుర్రాడు గ్లోబల్ స్టార్ ని రంగంలోకి దించబోతున్నాడా?

Kiran Abbavaram

Kiran Abbavaram

గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటకి వచ్చి హిట్ ట్రాక్ ఎక్కాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. మాస్ ఇమేజ్ కోసం కెరీర్ స్టార్టింగ్ నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఈ సీమ కుర్రాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. జనవరిలో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన కిరణ్ అబ్బవరం మళ్లీ ఏప్రిల్ 7న ‘మీటర్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. మొదటిసారి పోలిస్ పాత్రలో నటిస్తున్న కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమాతో మాస్ మీటర్ పెంచుతాననే కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ని కలిశాడు.

చరణ్ ని కిరణ్ అబ్బవరం కలిసిన ఫోటోలని మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి కిరణ్ అబ్బవరం, చరణ్ ని క్యాజువల్ గానే కలిసాడా? లేకుంటే మీటర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా పిలవడం కోసం కలిసాడా అనేది చూడాలి. ఇటివలే మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దాస్ కా ధమ్కీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ని రంగంలోకి దించాడు. దీంతో తారక్ ఫాన్స్ అంతా దాస్ కా ధమ్కీ సినిమాకి సపోర్ట్ చెయ్యడంతో విశ్వక్ సేన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేసాడు. ఇదే బాటలో కిరణ్ అబ్బవరం కూడా ముందుకి వెళ్లి రామ్ చరణ్ ని ‘మీటర్’ సినిమా ఈవెంట్ కి ఇన్వైట్ చేస్తే మెగా అభిమానుల సపోర్ట్ యంగ్ హీరోకి దొరికే అవకాశం ఉంది. మరి మేకర్స్ ఆలోచన ఎలా ఉందో చూడాలి.

Exit mobile version