Site icon NTV Telugu

నిన్ను ఇలా పరిచయం చేస్తానని అనుకోలేదు.. తట్టుకోలేకపోతున్నా

kiran abbavaram

kiran abbavaram

‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమై ఆనతి కాలంలోనే మంచి ట్యాలెంట్ ఉన్న హీరో అని అనిపిచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమా తరువాత ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ చిత్రంతో కుర్రాళ్లను అభిమానులుగా మార్చేసుకున్న కిరణ్ తాజాగా ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇకపోతే ఇటీవలే ఈ యంగ్ హీరో ఇంట్లో విషాదం జరిగిన సంగతి తెలిసిందే. తన అన్న రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇక తాజాగా సోదరుడి మరణాన్ని తట్టుకోలేకపోతున్నా అంటూ కిరణ్ తన సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.

తమ ఉరికి రోడ్డు కూడా సరిగ్గా లేదని, తామిద్దరిలో ఒక్కరైనా బాగుపడి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తన అన్న కోరుకొనేవాడని, తాను హీరోగా అవ్వడం కోసం అన్న ఎన్నో కష్టాలు పడ్డాడని చెప్పుకొచ్చాడు. ” నేను హీరోగా అయ్యాకా.. నన్నెప్పుడు అందరికి పరిచయం చేస్తావు అని అడిగేవాడు.. కానీ ఇలా చేయాల్సివస్తుందని అనుకోలేదు.. నా వెనుక ఉన్నది మా అన్నయ్య అబ్బవరం రామాంజులు రెడ్డి.. రోడ్డుప్రమాదంలో తన జీవితాన్ని కోల్పోయాడు.. దయచేసి డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి.. మీ ఆనందం కోసం కష్టపడేవాళ్లు ఉంటారు.. అది మీరు పొందకుండా వెళ్ళిపోతే తట్టుకోలేరు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/CW_zS8UhCEu/

Exit mobile version