Site icon NTV Telugu

K Ramp : మీరిచ్చిన సక్సెస్‌ను మీతోనే సెలబ్రేట్ చేసుకుంటా.. కిరణ్ అబ్బవరం

K Ramp

K Ramp

ఎట్టకేలకు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘కె ర్యాంప్’ విజయాన్ని ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్ అయిన ఈ మూవీ మొదట మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, క్రమంగా కలెక్షన్లను పెంచుకుంటూ, పాజిటివ్ టాక్‌ని కూడా పొందుతోంది. జైన్స్ నాని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తో పాటు యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా రూపొందడంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. కిరణ్ గతేడాది క మూవీతో పెద్ద హిట్ సాధించిన తరువాత, దిల్ రూబాతో పెద్ద ఫలితం పొందలేకపోయిన, ఇప్పుడు కె ర్యాంప్ తో మరల ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు.

Also Read : Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కోసం.. వెంకీ కుడుముల కొత్త ప్లాన్ !

ఈ సందర్భంగా తాజాగా కిరణ్ ఒక థియేటర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి, తన విజయం ను ఫ్యాన్స్ తో డైరెక్ట్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. వారితో కలిసి డ్యాన్స్ వేసి మరి ఆనందం పంచుకున్నాడు. ఈ వీడియో అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, “మీరిచ్చిన సక్సెస్‌ను మీతోనే సెలబ్రేట్ చేస్తున్నా వేరే లెవల్ ఫీలింగ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ” అని క్యాప్షన్ పెట్టాడు. మొత్తనికి ఈ విజయం నేపథ్యంలో కిరణ్ ఫ్యాన్స్‌తో నేరుగా కనెక్ట్ అవ్వడం అతనికి ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని తెలిపారు. ఆడియన్స్ మధ్యలో నిలబడి, వారి ప్రేమను, సపోర్ట్‌ను తానే చూస్తున్నాడని, తన సక్సెస్ ఫ్యాన్స్ తోనే రియల్‌గా సెలబ్రేట్ చేయడం చాలా స్పెషల్ అనిపిస్తోందని చెప్పారు.

 

Exit mobile version