Site icon NTV Telugu

ఆగదు ఈ అన్వేషణ ఒక ప్రాణం తీసేంత వరకూ… ‘కిన్నెరసాని’ ట్రైలర్

Kinnerasani

చిరంజీవి అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ తన నెక్స్ట్ మూవీ “కిన్నెరసాని”తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో రవీంద్ర విజయ్, శీతల్, మహతి బిక్షు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శుభమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రామ్ తాళ్లూరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2022 జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ ను ఈరోజు విడుదల చేశారు.

https://ntvtelugu.com/r-narayana-murthy-meets-ap-minister-perni-nani/

రెండు నిమిషాలకు పైగా సాగిన ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. కళ్యాణ్ దేవ్ ఇందులో సరికొత్తగా కనిపిస్తున్నాడు. నిర్మాతలు ట్రైలర్‌ను చాలా చక్కగా కట్ చేశారు. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తూ అంచనాలను పెంచేసింది. దినేష్ కె బాబు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మహతి స్వర సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలెట్. “కిన్నెరసాని” స్టోరీ వేద అనే స్త్రీ తన తండ్రి కోసం వెతుకుతున్న కథ. ట్రైలర్ లో వచ్చిన ప్రతి డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది.

Exit mobile version