Site icon NTV Telugu

Vijay Devarakonda : కింగ్‌డ‌మ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ డేట్ ఫిక్స్

Vijaydevarakonda

Vijaydevarakonda

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ కింగ్‌డ‌మ్. ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు దేవరకొండ. ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు విజయ్. షార్ట్ హెయిర్‌తో ఊరమాస్‌ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇప్ప‌టికే రిలీజైన ఫ‌స్ట్ లుక్‌కు, రీసెంట్‌గా రిలీజైన టైటిల్ టీజ‌ర్‌కు సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈసారి తనలోని మాస్ యాంగిల్‌ను చూపించబోతున్నాడు.

Also Read : NANI : ‘ప్యారడైజ్’ కష్టాలు తీరినట్టే.. షూట్ స్టార్ట్ ఎప్పుడంటే.?

ఎన్టీఆర్ వాయిస్‌తో రిలీజ్ అయిన కింగ్‌డమ్ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందుకుతగ్గట్టే ఈ సినిమా నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ కింగ్‌డమ్ పై హైప్ పెంచుతూ వెళ్తున్నాడు. ఇక ఈ సినిమాను అనిరుధ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంటుందని టీజర్‌ బీజిఎంతోనే చెప్పేశాడు. అయితే ఈ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడట అనిరుధ్. కానీ సినిమా మొత్తంలో మూడే పాటలు ఉంటాయట. ఈ మూడు కూడా ఓ రేంజ్‌లో ఉంటాయని అందులో ఒకటి లవ్ సాంగ్ అని తెలుస్తోంది. కింగ్ డమ్ ఫస్ట్ సాంగ్ ప్రోమోను ఏప్రిల్ 30న రిలీజ్ చేయ‌నున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఇక ఈ సినిమాలో పాటలే కాదు అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పీక్స్‌లో ఉంటుందని సమాచారం. మరి ఈసారి అనిరుధ్ తన మ్యూజిక్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ లో ఉన్న కింగ్‌డ‌మ్ మే 30న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

Exit mobile version