Kingdom : విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ మూవీ కింగ్ డమ్. చాలా రోజుల తర్వాత విజయ్ మూవీకి మంచి బుకింగ్స్ వచ్చాయి. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ జులై 31న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇది హిట్టా లేదా ప్లాపా అన్నదానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. మూవీ టీమ్ హిట్ అంటుంటే.. రివ్యూలు, చూసిన ఆడియెన్స్ మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఏ సినిమా అయినా సరే హిట్టా కాదా అనేది బయ్యర్ల లాభాలను బట్టి తెలిసిపోతుందని అన్నారు. సినిమా కొన్ని బయ్యర్లు జీఎస్టీతో బయట పడితే అది హిట్ అని.. జీఎస్టీ వాళ్లకు మిగిలితే అది సూపర్ హిట్ అని.. కమీషన్లు కూడా వస్తే అది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పారు.
Read Also : Vijay Deverakonda: కింగ్‌డమ్ రెండవ భాగం అద్భుతంగా ఉండబోతుంది!
ఈ లెక్కన తన సినిమా చాలా చోట్ల సూపర్ హిట్ స్టేజ్ లో ఉందన్నారు. ‘కింగ్ డమ్ విషయంలో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తేనే ఇది సూపర్ హిట్ అని తేలిపోయింది. ఏ సినిమా హిట్, లేదా ప్లాప్ అనేది చెప్పలేం. అది ప్రేక్షకుల ఆదరణను బట్టి తేలుతుంది. ఈ లెక్కన కింగ్ డమ్ కు మంచి ఆదరణ ఉంది. కొన్ని సార్లు సెకండ్ వారంలో వసూళ్లు పెరుగుతాయి. అది సీజన్ ను బట్టి ఉంటుంది. తెలుగుతో పాటు మాకు అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మలయాళంలో మేం అనుకున్న దాని కంటే ఎక్కువ కలెక్షన్లే వచ్చాయి. మూవీ కంటెంట్ బాగుంది కాబట్టే ప్రేక్షకులు చూస్తున్నారు’ అంటూ తెలిపాడు నిర్మాత నాగవంశీ. ఆయన చేసిన కామెంట్స్ ను బట్టి కింగ్ డమ్ సూపర్ హిట్ అని మూవీ టీమ్ చెప్పుకుంటోందన్నమాట.
Read Also : Celebrity Divorce: విడాకులపై షాకింగ్ రీజన్ చెప్పిన ప్రముఖ నటి.. మంచి మూడ్‌లో ఉంటే నిద్రపోతాడు..!
