Site icon NTV Telugu

Naga Vamsi : కింగ్ డమ్ ప్లాప్ కాదు.. నాగవంశీ ఫస్ట్ రియాక్షన్

Naga Vamsi

Naga Vamsi

Naga Vamsi : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ మూవీ భారీ అంచనాలతో వచ్చింది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో అంతా ప్లాప్ అంటూ ప్రచారం చేశారు. ఆ రిజల్ట్ మీద ఇప్పటి వరకు మూవీ టీమ్ పెద్దగా స్పందించలేదు. తాజాగా నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి మొదటిసారి రియాక్ట్ అయ్యారు. నా దృష్టిలో కింగ్ డమ్ మూవీ అసలు ప్లాప్ కాదు. అసలు కింగ్ డమ్ ను ఎందుకు అలా ప్రచారం చేశారో నాకు తెలియదు. ఈ సినిమాకు అమెరికాలోనే సుమారు రూ. 28 కోట్లు వచ్చాయి.

Read Also : Jaanhvi Kapoor : పురుష అహంకారం.. హీరోలపై జాన్వీకపూర్ సంచలన కామెంట్స్

ఇక్కడ నైజాంలో రూ.12 కోట్ల దాకా వసూళ్లు వచ్చాయి. అలాంటప్పుడు సినిమాను ఫెయిల్ అని ఎలా అంటారు. ఈ సినిమా నాకు ఎలాంటి నష్టాలు తీసుకురాలేదు. నా నుంచి కొన్న బయ్యర్లు కూడా అందరూ సేఫ్. ఒకరిద్దరికి నష్టాలు ఉంటే వారికి జీఎస్టీ రూపంలో రిటర్న్ ఇచ్చేశాం. దీంతో అందరూ సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. అలాంటప్పుడు కింగ్ డమ్ మూవీ ప్లాప్ ఎలా అవుతుంది. ఈ మూవీ అన్ని రకాలుగా మాకు మంచి హిట్ జోన్ లోనే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత నాగవంశీ.

Read Also : Rana : తండ్రి కాబోతున్న హీరో రానా..?

Exit mobile version