NTV Telugu Site icon

Agent: చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ కాదు ‘కింగ్’ వస్తున్నాడు…

Agent

Agent

అక్కినేని అఖిల్ మొదటిసారి కమర్షియల్ స్పేస్ లోకి వస్తూ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. గ్లిమ్ప్స్ నుంచే ఏజెంట్ సినిమాని మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రాజెక్ట్ చేస్తూ వచ్చిన మేకర్స్, ప్రమోషన్స్ ని కూడా హ్యూజ్ స్కేల్ లో ప్లాన్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ చేస్తూ ఏజెంట్ సినిమాని మేకర్స్ అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధమయ్యింది. వరంగల్ లో ఈరోజు జరగనున్న అఖిల్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్, ప్రభాస్ లలో ఒకరు గెస్టుగా వస్తారు అనే మాట గత కొన్ని రోజులుగా వినిపించింది. ఈ ముగ్గురు స్టార్ హీరోల్లో ఎవరు వచ్చినా ఏజెంట్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి మంచి బజ్ వస్తుందని ఫాన్స్ కూడా అనుకున్నారు అయితే అక్కినేని అభిమానులని మరింత కిక్ ఇచ్చే న్యూస్ బయటకి వచ్చింది. చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు కాదు ఏజెంట్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి కింగ్ వస్తున్నాడు అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఏజెంట్ సినిమాని నాగార్జున పట్టించుకోవట్లేదు, అసలు కింగ్ నాగ్ ఏజెంట్ సినిమాని ప్రమోట్ చెయ్యట్లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్న నేపధ్యంలో… ఏజెంట్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి నాగార్జున గెస్టుగా రావడం అక్కినేని అభిమానులకి కిక్ ఇచ్చే విషయమే.

ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి వరంగల్ లోని రంగలీలా మైదానంలో ఏజెంట్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. కింగ్ నాగ్, ఏజెంట్ అఖిల్ గురించి ఎలాంటి కామెంట్స్ చేస్తాడు? ఎంత బజ్ జనరేట్ చేస్తాడు అనేది చూడాలి. ఇదిలా ఉంటే ఏజెంట్ సినిమా నుంచి ‘వైల్డ్ సాలా’ సాంగ్ కూడా ఈరోజే బయటకి రానుంది. బాలీవుడ్ డాన్సింగ్ డీవా ‘ఊర్వశీ రౌతెల్లా’ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిన ఈ సాంగ్ సినిమాకే హైలైట్ అయ్యేలా ఉంటుందట. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘వైల్డ్ సాలా’ సాంగ్ ప్రోమో మంచి మాస్ నంబర్ అనిపించేలా ఉంది. ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో ఇదే లాస్ట్ లెగ్ ఆఫ్ ఈవెంట్స్. మరి ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమాతో అఖిల్ ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది చూడాలి.