NTV Telugu Site icon

King Nag: క్లాస్ హీరో మాస్ సినిమా చేస్తే ఉంటది… ‘నా సామీ రంగా’!

King Nag

King Nag

కింగ్ నాగార్జున బర్త్ డే కోసం అక్కినేని అభిమానులంతా ముందెన్నడూ లేనంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నాగ్ 99వ సినిమాకి సంబంధించిన అపడ్తే బయటకి వచ్చేది ఈరోజే. సో బర్త్ డే రోజున నాగార్జున నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ వస్తుందని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ నాగార్జున బర్త్ డే రోజున మోస్ట్ అవైటెడ్ అన్నౌన్స్మెంట్ వచ్చేసింది. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని చెరిపేయడానికి అక్కినేని నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో చేస్తున్న సినిమా అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి ‘నా సామీ రంగ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ-డైలాగ్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇటీవలే ప్రోమో షూట్ జరుపుకున్న “నా సామీ రంగ” ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. నైట్ ఎఫెక్ట్ లో, అరవై మంది రౌడీలని ఒక షెడ్డు లోపల ఉండగా.. విలన్ ఎంట్రీ ఇచ్చాడు. అతనికి లోపలి వెళ్లగానే, విలన్ ని చూసి రౌడీ అతని తల కావాలా? చేతులు నరకాలా? అని అడుగుతుండగా… ఒక రౌడీ లేచి అసలు ఎవడన్నా వాడు అనగానే విలన్ నుంచి ‘కింగ్’ అని పేరు రావడం, రౌడీలకి చెమటలు పట్టడం ఒకేసారి జరిగాయి. ఈ సమయంలో ‘కింగ్’ అనే ఇన్సర్ట్ షాట్ సూపర్బ్ గా ఎలివేట్ అయ్యింది. కింగ్ అనే మాట వినగానే రౌడీల్లో భయం, టేబుల్ పైన దరువు వేస్తూ నాగార్జున రివీల్ అవ్వడం విజిల్ వర్త్ రివీలింగ్ అనే చెప్పాలి. రెడ్ షర్ట్ లో, లాంగ్ హెయిర్ లో నాగార్జున ఫేస్ రివీల్ చేసిన విధానం కిక్ ఇచ్చింది.

నాగార్జున చాలా రోజుల తర్వాత కంప్లీట్ మాస్ లుక్ లో ఉన్నాడు. రౌడీలందరినీ కొట్టి షెడ్డు బయటకి వచ్చి బీడీ వెలిగించిన నాగార్జున “ఈ సంక్రాంతికి నా సామీ రంగ” అని చెప్పడంతో ప్రోమో ఎండ్ అయ్యింది. దీంతో సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది అనే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ప్రోమోని డిజైన్ చేసిన విధానం, దీనికి ‘జాతారో జాతర’ అంటూ కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మధ్య కాలంలో చూడని నాగార్జునని చూపించిన ఈ ప్రోమో సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ తోనే పెంచేసింది. మరి శరవేగంగా షూటింగ్ జరుపుకొని సంక్రాంతి సాలిడ్ హిట్ అవుతుందేమో చూడాలి.