Site icon NTV Telugu

Kiccha Sudeep : అలా చేస్తే ఆయనపై గౌరవం పెరిగేది.. డిప్యూటీ సీఎంపై సుదీప్ కామెంట్స్

Kichaa Sudeep

Kichaa Sudeep

Kiccha Sudeep : కర్ణాటక డిప్యూటీ సీఎం డీఏ శివకుమార్ కన్నడ ఇండస్ట్రీపై సీరియస్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన గతంలో మాట్లాడుతూ.. కన్నడ సినిమా నటుల తీరు మారకపోతే వారిని ఎలా సరిచేయాలో తనకు తెలసు అన్నారు. ఈ వ్యాఖ్యలపై సుదీప్ స్పందించారు. ఆయనపై మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఎప్పుడు పిలిచినా మేమంతా వెళ్లేవాళ్లం. ప్రభుత్వానికి సహకరించడానికి మేమంతా ఎప్పుడూ రెడీగానే ఉంటాం. కన్నడ ప్రజల ఆశయాలను మేమంతా కనసాగిస్తున్నాం.

Read Also : Kubera : కుబేర మేకింగ్ వీడియో.. ధనుష్ కష్టం చూడండి..

ఒక కారుకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నట్లు, బోల్టులు బిగించాల్సి ఉంటుంది. ఆ మెకానిక్ దగ్గరకే మనం కారును తీసుకెళ్లాలి. అలాగే ఇండస్ట్రీలో సమస్యల గురించి ఇందులో ఉన్న వారికే తెలుస్తుంది. ఆయన అలాంటి కామెంట్స్ ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు. కన్నడ ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని సరిచేయడానికి ప్రభుత్వ సహకారం అవసరం. ఆ విధంగా ఏమైనా సలహాలు ఇచ్చి ఉంటే ఆయనపై మాకు గౌరవం పెరిగేది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Read Also : Laya : బాలకృష్ణ మూవీ కోసం ఏడ్చారా.. లయ క్లారిటీ..

Exit mobile version