బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్క బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన ఆఫర్స్ పట్టేస్తూనే ఇంకోపక్క తెలుగులోనూ హిట్ హీరోయిన్ గా మారింది. తెలుగులో ప్రస్తుతం కియారా, రామ్ చరణ్ సరసన శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం ఒక హీరోయిన్ అభిమానుల చేత తిట్లు తింటుంది. ఎందుకంటే .. ఆ హీరోయిన్ని అమ్మడు ఆంటీ అని పిలవడమే.. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే.. ఎవరు గ్రీన్ బ్యూటీ జూహీ చావ్లా.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ ” జూహీ ఆంటీ.. మా డాడీకి చిన్ననాటి స్నేహితురాలు. నేను ఎప్పుడు ఆమెను ఆంటీ అని పిలుస్తాను.. కానీ ఈ మాట ఆవిడ వింటే నన్ను చంపేస్తుంది అనుకుంటున్నాను. ఆమెను నేనెప్పుడు స్టార్ హీరోయిన్ గా చూడలేదు. నా తల్లిదండ్రుల స్నేహితురాలిగానే చూశాను. వారి పిల్లలతో కలిసి ఆడుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలపై జూహీ అభిమానులు మండిపడుతున్నారు. అంత అందమైన బ్యూటీని ఆంటీ అని పిలుస్తావా..? ఎంత ధైర్యం అని సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.
