NTV Telugu Site icon

Kiara Advani : హీరోతో బ్రేకప్ పై ఇన్ డైరెక్ట్ క్వశ్చన్… హీరోయిన్ ఎపిక్ రిప్లై

Kiara

Kiara

బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి బీటౌన్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. ఇన్నాళ్లూ డేటింగ్ చేస్తున్న కియారా, సిద్ధార్థ్ ఇప్పుడు విడిపోయారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ జంట ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చినప్పుడే కాదు, ఇప్పుడు విడిపోయారంటూ ప్రచారం జరుగుతున్నా తన గురించి కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకానీ క్లారిటీ ఇవ్వట్లేదు. తాజాగా ఆమెకు హీరోతో బ్రేకప్ పై ఇన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎదురైంది. దానికి ఆమె స్పందించిన తీరు ఎపిక్ అంటున్నారు ఆ వీడియో చూసిన అభిమానులు.

Read Also : Avatar 2 : విడుదలకు ముందే యూనిక్ రికార్డు

కార్తీక్ ఆర్యన్‌, కియారా హీరోహీరోయిన్లుగా నటించిన “భూల్ భూలయ్యా 2” ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఇదంతా జరిగింది. ఈ కార్యక్రమంలో “మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా?” అంటూ కియారా ను ప్రశ్నించాడు ఓ విలేఖరి. ఆ ప్రశ్నకు స్పందించిన కియారా “నా జీవితంలో ఇప్పటిదాకా నేను కలిసిన ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే. ఎవరినీ మరిచిపోవాల్సిన అవసరం లేదు” అంటూ ఇంటెలిజెంట్ గా సమాధానం ఇచ్చింది. నిజానికి సిద్ధార్థ్, కియారా డేటింగ్ విషయంపై ఎప్పుడూ స్పందించలేదు. కానీ బయట వారిద్దరూ కలిసి ఎక్కువగా కన్పిస్తుండడం, టైం స్పెండ్ చేస్తుండడంతో ఈ పుకార్లు బయలుదేరాయి. 2021లో వచ్చిన “షేర్షా “చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండడంతో ఆ పుకార్లు మరింతగా వ్యాపించాయి.