బాలీవుడ్ లో కియారా అద్వానీ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా రాణిస్తుంది. ప్రస్తుతం సౌత్ సినిమాల కోసం కియారా డిమాండ్ చేస్తున్న పారితోషికం అందరికీ షాకింగ్ గా మారింది. కాగా ఈ అమ్మడు దర్శకుడు కొరటాల-యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో నటించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే సౌత్ సినిమాలకు కియారా 3 కోట్ల మేర డిమాండ్ చేస్తోంది. తాజాగా అదే రెమ్యునరేషన్ తో ఈ ప్రాజెక్ట్ కు కియారా ఒకే చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మొదటి నుంచి ఆమెను ఎంపిక చేయాలా, వద్దా.. అనే సంశయంలో ఉన్న దర్శకనిర్మాతలు తాజాగా ఆమెను సంప్రదించి ఫైనల్ చేసారని సమాచారం. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ లాంటి సినిమాలతో ప్రేక్షకులకూ సుపరిచితురాలైన కియారాకు టాలీవుడ్ లోను మంచి క్రేజ్ ఏర్పడింది.
#NTR30: కియారా అద్వానీకి భారీ పారితోషికం?
