బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్లు బిటౌన్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని నెలల్లోకియారా ముంబైలోని సిద్ధార్థ్ నివాసంలో పదే పదే కంపించడంతో ఆ రూమర్లకు బలం చేకూరింది. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సమయంలో కియారా అద్వానీ సహనటుడిగా, స్నేహితుడిగా సిద్ధార్థ్‌తో తన రిలేషన్ గురించి, అలాగే ఆమె వివాహ ప్రణాళిక గురించి వెల్లడించింది. సిద్దార్థ్ గురించి కియారా మాట్లాడుతూ “ఒక సహనటుడిగా అతను పనిపై చాలా ఫోకస్ చేస్తాడు. తన పాత్ర కోసం చాలా ప్రిపేర్ అవుతాడు. చాలా చదువుతాడు. నేను సినిమాలో పని చేయడానికి ఇష్టపడే విధానానికి, దీనికి చాలా దగ్గర పోలిక ఉంటుంది. ఇండస్ట్రీలో సిద్ధార్థ్ నాకు అత్యంత సన్నిహితుడు” అంటూ చెప్పుకొచ్చింది.
Read Also : సత్యదేవ్ కు అదిరిపోయే మెగా ఆఫర్
ఇక కియారా అద్వానీ వివాహంపై తన అభిప్రాయాన్ని కూడా బయట పెట్టింది. తాను అస్సలు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోనని, ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో తెలీదు కానీ అది ఖచ్చితంగా ప్రేమ వివాహమే అని అంటోంది. కాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ నటించిన చిత్రం “షేర్షా” విడుదలకు సిద్ధంగా ఉంది. పరమ వీర చక్ర అవార్డు గ్రహీత, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. రామ్ చరణ్ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ “ఆర్సీ 15″లో కియారా హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే.
