Kiara Advani: భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో వసుమతిగా తెలుగువారి గుండెల్లో గూడు కట్టేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఈ చిన్నది రామ్ చరణ్ సరసన విదియ విధేయ రామ సినిమాలో కనిపించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా.. అమ్మడికి మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఇక ఈ సినిమా తరువాత బాలీవుడ్ లోనే సెట్ అయిపోయి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గతేడాది ప్రేమించిన సిద్దార్థ్ మల్హోత్రాను వివాహమాడి వైవాహిక జీవితంలోకి కూడా అడుగుపెట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి , బాలీవుడ్ హీరోయిన్ ల గురించి చెప్పాలంటే.. వీరికి పెళ్లి కు ముందు పెళ్లి తరువాత అనే బేధం ఎందులోకూడా ఉండదు. వరుస సినిమాలు, అందాల ఆరబోత, చిట్టిపొట్టి డ్రెస్ లు.. ఇలా ఏవి మారవు. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రీనా కైఫ్.. ఇప్పుడు కియారా. పెళ్లి తరువాత కూడా వీరిలో ఎటువంటి మార్పు రాలేదు.
తాజాగా కియారా డ్రెస్సింగ్ స్టైల్ అందుకు నిదర్శనమని చెప్పాలి. వైట్ అండ్ వైట్ షార్ట్ డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ ఫాలోవర్స్ ని టెంప్ట్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఇది మరీ షార్ట్ డ్రెస్ గా కనిపిస్తుంది. పెళ్లి తరువాత చాలామంది ఇలాంటి డ్రెస్ లు వేసుకోవడానికి కొద్దిగా భయపడతారు. నెటిజన్లు విమర్శిస్తారు.. కొత్తగా పెళ్లి అయ్యింది.. ఇలాంటి డ్రెస్ లు ఏంటి అంటూ ఏకిపారేస్తారు. అయినా కియారా మాత్రం అలాంటివి పట్టించుకోకుండా ఈ రేంజ్ అందాల ప్రదర్శన చేసి ఔరా అనిపించింది ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో చరణ్ సరసన గేమ్ ఛేంజర్ లో నటిసస్తోంది.
