Site icon NTV Telugu

Kiara Advani: గూగుల్ టాప్ సెర్చ్.. ఈ ముద్దు గుమ్మ పేరే ఫస్ట్

Kiara

Kiara

Kiara Advani: ఇంకో పది రోజుల్లో డిసెంబర్ ఎండ్ కు వచ్చేస్తోంది. ఈ ఏడాది .. అరెరే ఏంటి అప్పుడే అయిపోయింది అని అనిపించకమానదు. ఇక ఈ ఏడాదిలో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. ఎంతోమంది కొత్తవారు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఏడాది మొత్తంలో ప్రేక్షకులు తమ అభిమాన తారలు గురించి ఎన్నో విషయాలపై గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటారు. మరి ఈ ఏడాది ఆ గూగుల్ సెర్చ్ లో ఎవరు టాప్ ఉన్నారు అంటే.. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ టాప్ లో ఉంది. ఈ చిన్నదాని గురించి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా వెతికారు. ముఖ్యంగా ఆమె పెళ్లి గురించి.. సినిమాల గురించి ఎక్కువ సెర్చ్ చేశారు. ఇక ఈ టాప్ లో కియారా ఒక్కత్తే ఉండడం విశేషం..ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ హీరోయిన్లను కాకుండా కియారా అద్వానీ గురించి నెటిజన్లు సర్చ్ చేశారనే వార్త ఆమె అభిమానులను ఆనందంలో ముంచేసింది.

కియారాకు ఇలాంటి ఘనత దక్కడంపై బాలీవుడ్ వర్గాలు కూడా ప్రశంసిస్తున్నారు. ఇటీవల కాలంలో బలమైన పాత్రలతో కియారా ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె తరువాత టాప్‌-10లో ఏకంగా ఆరుగురు క్రికెటర్లు ఉండగా.. టీమిండియాకు చెందిన వారు ముగ్గురు ఉండడం విశేషం.. వారిలో శుభమన్ గిల్ రెండో స్థానంలో ఉండగా, మొహమ్మద్‌ షమీ నాలుగో స్థానంలో, సూర్యకుమార్‌ యాదవ్‌ తొమ్మిదో ప్లేస్‌లో ఉండగా.. న్యూజిలాండ్‌ నయా సెన్సేషన్‌ రచిన్‌ రవీంద్ర మూడో స్థానంలో, ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఏడులో, వరల్డ్‌కప్‌ ఫైనల్‌ హీరో ట్రవిస్‌ హెడ్‌ పదో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సెర్చ్ లిస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version