సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండదని, కేవలం గ్లామర్ టచ్ కోసం మాత్రమే అని చాలా మంది అభిప్రాయం. కానీ ఇటీవలి కాలంలో కొంతమంది దర్శకులు హీరోలతో సమానంగా హీరోయిన్‌లకు కూడా విలువైన పాత్రలు రాస్తున్నారు. ప్రతి సినిమా అలాంటిదే అని చెప్పలేం. కానీ తాజాగా విడుదల అయిన ‘వార్ 2’ మాత్రం అలాంటి కోవాకి చెందిందే.
Also Read : Rao Bahadur : రాజమౌళి చేతుల మీదుగా.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!
ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటించినా, ఆమె పాత్ర మాత్రం ఎక్కువగా ఆకట్టుకోలేదని బీటౌన్ టాక్. ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ఆమె రోల్ గెస్ట్ అప్పియరెన్స్‌లా అనిపించిందని, అందులోను ఎడిటింగ్‌లో కొన్ని ముఖ్యమైన సీన్లు ట్రిమ్ చేయడం వల్ల, ఆమె పాత్ర మరింత బలహీనంగా మారిపోయిందని కామెంట్లు వినిపించాయి. అయితే వైరల్ అవుతున్న ఇంకో వార్త ఏంటి అంటే.. ఈ పాత్రకు మొదటగా అలియా భట్‌ని అనుకున్నారట. దర్శకుడు అయాన్ ముఖర్జీ, అలియా భట్‌ల మధ్య ఉన్న స్నేహం, వర్క్ బాండింగ్ అందరికీ తెలిసిందే.
‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ అద్భుతంగా పనిచేసింది. అయినప్పటికీ అలియా మాత్రం ఈ రోల్‌ను సున్నితంగా తిరస్కరించిందట. కారణం? ఈ పాత్రకు తాను 100% న్యాయం చేయలేనేమో అన్న భయమేనట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం కృతి సనన్, శ్రద్ధా కపూర్‌ల పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. చివరికి అప్పటికే వరుస విజయాలతో ట్రెండింగ్‌లో ఉన్న కియారా అద్వానీని ఫైనల్ చేశారు. కానీ సినిమాల్లో హీరోలు, విలన్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తుండగా, హీరోయిన్‌గా కియారా గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకోవడం లేదు.