NTV Telugu Site icon

Khushi: ఆ సినిమాను గుర్తుచేస్తున్న ఖుషి.. ఇది కూడా హిట్ అయ్యేలానే ఉందే

Khushi

Khushi

Khushi: సాధారణంగా ప్రతి సినిమాలో మరో సినిమాకు సంబంధించిన పోలికలు ఉంటూనే ఉంటాయి. అయితే కథాకథనాలను డైరెక్టర్ చూపించినదాన్ని బట్టి సినిమా హిట్ అవుతుందా..? లేదా.. ? అనేది తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ వరుసగా సాంగ్స్, పోస్టర్స్ రిలీజ్ చేసి హైప్ పెంచేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక క్రిస్టియన్ అబ్బాయి, బ్రాహ్మణల అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాకా వారి మధ్య వచ్చే గొడవలు.. ? ఆ గొడవలను వారు ఎలా సాల్వ్ చేసుకున్నారా..? ఇంట్లో పెద్దవాళ్ళను ఒప్పించారా.. ? చివరికి ఈ జంట తమ పెళ్లిని నిలబెట్టుకున్నారా.. ? అనేది సినిమ చూసి తెలుసుకోవాలని మేకర్స్ తెలిపారు.

Rajinikanth: అర్ధమయ్యిందా రాజా.. వాళ్లకు కౌంటరేనా.. ?

సమంత – విజయ్ ల పెయిర్ చాలా బావుంది.. లవ్, మ్యారేజ్, గొడవలు.. వారి మధ్య బంధం ఇలా వీటిని చూస్తుంటే.. 2000 సంవత్సరంలో విడుదలైన సఖి సినిమా గుర్తొస్తుంది అని అభిమానులు చెప్పుకురావడం విశేషం. అందుకు కారణం కూడా లేకపోలేదు. ట్రైలర్ లో ఉన్న షాట్స్ ను చూస్తుంటే సఖి కథనే అందరి మదిలో మెదులుతుంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో కూడా.. హీరో హీరోయిన్స్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు.. బయటికి వచ్చేసి బతుకుతారు. కానీ, పెళ్లి అయిన దగ్గరనుంచి వారి మధ్య గొడవలు సాగుతూనే ఉంటాయి.. అయినా వారి మధ్య ఉన్న ప్రేమ వారిని మరింత దగ్గర చేస్తోంది.

Guntur Kaaram: మహేష్ కబడ్డీ కూత.. థియేటర్ లో మోగాలి మోత

ఖుషి కథ కూడా సేమ్ అలానే ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. విజయ్.. సామ్ ను చూసి ప్రేమించడం.. ఆమె వెనుక పడడం .. ప్రేమ, పెళ్లి, గొడవలు.. ఎడబాటు.. మళ్లీ కలుసుకోవడం.. ఇదంతా సఖి సినిమానే గుర్తుచేస్తోంది. అయితే ఇందులో శివ నిర్వాణ కొత్తగా ఏదైనా యాడ్ చేశాడా.. ? అది ఇది కాదు అంటే సినిమా వచ్చేవరకు చూడాల్సిందే. ఇప్పటికే నా రోజా నువ్వే సాంగ్ లో మణిరత్నం అభిమాని అని అనిపించుకున్న శివ నిర్వాణ.. ఈ ట్రైలర్ చూసాక ఇంత అభిమానినా అని అనిపించుకుంటున్నాడు. మణిరత్నంకు ఫ్యాన్ అని తెలుసు కానీ.. ఆయన సినిమానే ఇలా రీక్రియేట్ చేస్తావనుకోలేదయ్యా ..? అని కొందరు అంటుండగా .. సఖి వైబ్స్ ఉన్నాయి అంటే ఈ సినిమా కూడా హిట్ అనుకుంటుంది అని ఇంకొందరు చేస్తున్నారు..మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.