Site icon NTV Telugu

ఎల్లో డ్రస్ లో ఏంజిల్ ఖుషీ : చేమంతిలా మతిపొగొట్టిన కపూర్ బ్యూటీ!

బాలీవుడ్ లో ‘కపూర్’ అనే పదానికి ఉన్న క్రేజ్ ప్తత్యేకం! రాజ్ కపూర్ మొదలు రణబీర్ కపూర్ దాకా బోలెడు మంది స్టార్స్! హీరోయిన్స్ గా కూడా కపూర్ బ్యూటీస్ ఇప్పటికే బోలెడు మంది ఉన్నారు. కరిష్మా, కరీనా, శ్రద్ధా లాంటి కపూర్ లేడీస్ వారసత్వంతో వస్తే… వాణీ కపూర్ లాంటి అందగత్తెలు స్వయంకృషితో ఎదుగుతున్నారు. ఇప్పుడు మరో కొత్త కపూర్ బేబీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది…

శ్రీదేవి వారసురాలిగా ఇప్పటికే జాన్వీ కపూర్ సత్తా చాటుతోంది. నటన మాట ఎలా ఉన్నా అందం విషయంలో ఎప్పటికప్పుడు సోకులతో షాకులిస్తుంటుంది! అక్క బాటలోనే త్వరలో చెల్లెలు ఖుషీ కపూర్ కూడా బ్యూటీ బ్యాటిల్లోకి దిగబోతోందట! అమెరికాలో అభినయంలో శిక్షణ పొందుతోన్న జూనియర్ కపూర్ రీసెంట్ గా అనీల్ కపూర్ కూతురి పెళ్లికి హాజరైంది. సోనమ్ కపూర్ సొదరి రియా కపూర్ వివాహం కరణ్ భులానీతో అయిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకి తరలి వచ్చిన ఖుషి ఎల్లో కలర్ లెహంగాలో ఏంజిల్ లా మెరిసిపోయింది! పచ్చటి పరికిణీలో పంజాబీ పాప చేమంతి పువ్వులా విరబూసింది! మొత్తం ఈవెంట్ లోనే హైలైట్ గా నిలిచింది…

జాన్వీ కంటే టాల్ గా ఉండే ఖుషీ కపూర్ టాలెంటెడ్ కూడా అయితే బాలీవుడ్ లో తిరుగుండదు. చూడాలి మరి, బోనీ కపూర్ గారాల పట్టి బోణీ ఎప్పుడు కొడుతుందో!

Exit mobile version