Khushboo Sundar Hospitalised Due To Adenovirus: సినీ, రాజకీయ రంగాల్లో దూసుకుపోతున్న ఖుష్బూ సుందర్ తాజాగా ఆసుపత్రిపాలయ్యారు. అడెనో వైరస్ బారిన పడిన ఆమె.. తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఈమేరకు ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫోటోలను షేర్ చేసిన ఖుష్బూ.. తాను తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులు, నీరసంతో ఆసుపత్రిలో చేరినట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘నేను ఎల్లప్పుడూ చెప్పినట్లుగా.. ఫ్లూ అనేది చాలా చెడ్డది. ఇది నాపై దుష్ప్రభావం చూపించింది. అధిక జ్వరం, తీవ్రమైన ఒంటినొప్పులు, బలహీనతతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అడెనో వైరస్‌ను తక్కువ అంచనా వేయొద్దు. మీలో ఏమాత్రం లక్షణాలు కనిపించినా.. ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోండి. మీ ఆరోగ్యానికి కాపాడుకోండి. నేను మెల్లగా కోలుకుంటున్నాను’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఖుష్బూ చెప్పుకొచ్చింది. ఈమె పోస్ట్ చూసిన సెలెబ్రిటీలు.. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
Sharad Pawar: అదాని, అంబానీలపై దాడి చేయడం కరెక్ట్ కాదు
కాగా.. ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో రాణిస్తూ, రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్‌గానే ఈమె తన తండ్రిపై లైంగిక ఆరోపణలు చేసి, టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు. తన తండ్రి కారణంగా ఎనిమిదేళ్ల వయసులోనే లైంగికంగా వేధింపులకు గురయ్యానని.. అయితే పదహారేళ్ల వయసులో తిరగబడటం నేర్చుకున్నానని తెలిపింది. దాంతో.. తనని, తల్లిని వదిలిన తండ్రి ఎక్కడికో వెళ్లిపోయారంటూ కుండబద్దలు కొట్టారు. తండ్రి వెళ్లాక చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇదిలావుండగా.. కుష్బూ 2000లో తమిళ నటుడు సి. సుందర్‌ని వివాహమాడారు. గతేడాది ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె.. జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.
Japanese Military Helicopter: కుప్పకూలిన జపాన్ ఆర్మీ హెలికాప్టర్.. 10 మంది గల్లంతు