NTV Telugu Site icon

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఖిలాడి’

Khiladi

మాస్ మహరాజా రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతీ హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఖిలాడి’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. తెలుగుతో పాటు ఈ నెల 11న ఈ మూవీ హిందీలోనూ విడుదల కాబోతోంది. రవితేజ రెండు భిన్నమైన పాత్రలు పోషించిన ఈ మాస్ మసాలా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన 5 పాటలూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం బాగా జరిగిన ‘ఖిలాడి’ని ఆ చిత్ర నిర్మాణ భాగస్వామ సంస్థల్లో ఒకటైన పెన్ మూవీస్ హిందీలో రిలీజ్ చేస్తోంది. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ ఈ మూవీని నిర్మించారు.

Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ

Show comments