Site icon NTV Telugu

Khiladi కాంట్రవర్సీ రూమర్స్… ఫుల్ స్టాప్ పెట్టేసిన నిర్మాత

khiladi

మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ మూవీ “ఖిలాడీ” రేపు థియేటర్లలోకి రానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని రూమర్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా నిర్మాతలకూ, రవితేజకు మధ్య రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు వచ్చాయని, అందుకే రవితేజ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ నిన్న సాయంత్రం జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఈ రూమర్స్ అన్నింటికీ క్లారిటీ ఇచ్చారు.

Read Also : RC15 షూటింగ్ వాయిదా… చెర్రీనే కారణం !

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ “ఖిలాడీ సినిమాను 90 రోజుల్లో పూర్తి చేయాలని అనుకున్నాము. కానీ సినిమాను కంప్లీట్ చేయడానికి 130 వర్కింగ్‌డేస్‌ పట్టింది. కానీ రవితేజ రెండు సినిమాల పని చేశారు. ఆయన ఏ రోజూ ఎక్కువ కాల్షీట్లు తీసుకుంటున్నారు అని అడగలేదు. సినిమా బాగా రావాలని తపన పడ్డారు తప్ప ఎప్పుడూ షూటింగ్ కు ఎక్కువ సమయం పడుతోందని కంప్లైంట్ చేయలేదు. రవితేజ సెట్ లో ఉంటే ఒక కిక్ వస్తుంది” అంటూ రవితేజపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో నిర్మాతకూ, రవితేజకు మధ్య వివాదం అంటూ వచ్చిన రూమర్లకు చెక్ పడినట్టే.

Exit mobile version