NTV Telugu Site icon

Khakee The Bengal Chupur : బెంగాల్ టైగర్ ‘ఖాకీ’గా సౌరభ్ గంగూలీ

Untitled Design 2025 03 17t145040.658

Untitled Design 2025 03 17t145040.658

నెట్ ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోదా జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా బిహార్ చాప్టర్ రూపొందింది. ఆయన రచించిన ‘బిహార్ డైరీస్’ ఆధారంగా ఈ సిరీస్ తీశారు. 2022 లో ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదలై విశేషంగా ఆకట్టుకోవడంతో, దీనికి సీజన్ 2ను రూపొందించారు. ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’ సీక్వెల్ గా రాబోతుంది. అయితే తాజాగా సోమవారం (మార్చి 17) చిన్న ప్రోమో వదిలారు మూవీ టీం, ఇందులో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. బెంగాల్ పేరుతో సిరీస్ చేస్తూ దాదాను పిలవరా? అని గంగూలీ రాకతో ప్రోమో స్టార్ట్ అయింది.

సౌరభ్ గంగూలీ నటుడిగా తెరంగేట్రం చేయనున్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరలైన విషయం తెలిసిందే. ఇక ఖాకీ 2 లో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారని కొన్ని ఫోటోలు కూడా షేర్ అయ్యాయి. తాజాగా వీటిపై క్లారిటీ వచ్చింది. మార్చి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుపుతూ నెట్ ఫ్లెక్స్ ఓ ప్రోమో వీడియో విడుదల చేసింది.అందులో గంగూలీ ఖాకీ దుస్తుల్లో కనిపించారు. హీరో చేయాల్సిన పనులన్నీ దర్శకుడు వివరించగా.. ఇవన్నీ చేయడం తనవల్ల కాదని గంగూలీ అంటాడు. దీంతో ఈ సిరీస్ ప్రచారంలో మాత్రమే గంగూలీ భాగమయ్యారని అర్ధమవుతోంది.