NTV Telugu Site icon

Bholaa Teaser: సార్ ఇది ఖైదీ సినిమాలా లేదే…

Bholaa Teaser

Bholaa Teaser

Khaithi Remake Bholaa Teaser Released: ఒక హిట్ సినిమాని రీమేక్ చేయాలి అంటే చాలా జాగ్రతలు తీసుకోవాలి, ఒరిజినల్‌ని అలానే తెరకెక్కిస్తే ఫ్రేమ్ బై ఫ్రేమ్ కాపీ అంటారు. కొంచెం మార్చి తీస్తే ఒరిజినల్ సినిమాలో ఉన్న ఫ్లేవర్ మిస్ అయ్యింది అంటారు. ఇప్పుడు ఇలాంటి మాటే అజయ్ దేవగన్ నటిస్తున్న ‘భోలా’ సినిమా గురించి కూడా వినిపిస్తోంది. రీసెంట్‌గా దృశ్యం 2 సినిమా చేసిన అజయ్ దేవగన్, ఒరిజినల్ దృశ్యం 2 సినిమాకి పెద్దగా మార్పులు చేయకుండా ఒరిజినల్‌కి స్టిక్ అయ్యి సూపర్ హిట్ కొట్టాడు. ఇదే జోష్‌లో అజయ్ దేవగన్ మరో రీమేక్ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొని రావడానికి రెడీ అవుతున్నాడు. తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన ‘ఖైదీ’ సినిమాని హిందీలో ‘భోలా’ (BHOLAA) అనే టైటిల్‌తో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నాడు. తనే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి టీజర్‌ని వదిలాడు దేవగన్. నిమిషమున్నర నిడివితో కట్ చేసిన ఈ టీజర్ (BHOLAA TEASER OUT NOW)లో స్టార్టింగ్‌లో పాపా ఎపిసోడ్ సీన్ తప్ప మిగిలినదంతా చూస్తే.. అసలు ఇది ఖైదీ సినిమానేనా? లేక అజయ్ దేవగన్ ఇంకేదైనా సినిమా చేస్తున్నాడా? అనిపించక మానదు.

ఖైదీ సినిమాలో కార్తీ ‘డిల్లి’ అనే పాత్రలో ఏదో కారణాల వల్ల జైలుకి వెళ్లి, బయటకి వచ్చి తన కూతురిని చూడడానికి వెళ్లాలి అనుకుంటాడు. ఇంతలో పోలీసులని కాపాడే ఒక పని పెట్టుకొని, లారీ ఎక్కి ఫైట్స్ చేస్తాడు. ఎండ్‌లో విలన్స్ కి ‘డిల్లి’ ఎవరో ముందే తెలుసు అనే ట్విస్ట్ ఇస్తూ సినిమా ఎండ్ అవుతుంది. లోకేష్ కనగరాజ్ ఖైదీ మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు. ఆడియన్స్‌కి ఖైదీ మూవీలోని యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత నచ్చాయో, పాపా సెంటిమెంట్ కూడా అంతే కనెక్ట్ అయ్యింది. భోలా టీజర్ చూస్తే ఖైదీ అనే ఫీలింగ్ కూడా రావట్లేదు. హీరో బైక్ ఎక్కి, త్రిశూలం పట్టి ఫైట్ చేస్తుంటే లోకేష్ కనగరాజ్‌కి కూడా ఇది నా సినిమా కాదే అనే ఫీలింగ్ రావడం గ్యారెంటీ. మొత్తానికి అజయ్ దేవగన్ ఖైదీ రీమేక్ చేస్తున్నాను అంటూ ‘భోలా టీజర్’తో పెద్ద షాక్ ఇచ్చాడు.

Show comments