Site icon NTV Telugu

KH237: డైరెక్టర్స్ గా మారిన స్టంట్ మాస్టర్స్.. కమల్ తో సినిమా అధికారికం

Kamal

Kamal

KH237: విక్రమ్ సినిమాతో లోక నాయకుడు కమల్ హాసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా లాభాలను అందుకొని.. తన బ్యానర్ ను విస్తరిస్తున్నాడు. ఇక విక్రమ్ తరువాత కమల్ నటిస్తున్న చిత్రం థగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నీ కమల్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తో పాటు మణిరత్నం సొంత బ్యానర్ అయిన మద్రాస్ టాకీస్ తో కలిసి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఇంకా పూర్తి చేయకుండానే కమల్ తన కొత్త సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చాడు. KH237 గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ స్టంట్ మాస్టర్స్ అయిన అన్బరివ్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన అధికారిక వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఎన్నో హిట్ సినిమాలకు అన్బరివ్ స్టంట్ మాస్టర్స్ గా పనిచేశారు. అంత ఎందుకు కమల్ కు భారీ హిట్ ఇచ్చిన విక్రమ్ కూడా వారే స్టంట్ మాస్టర్స్ గా వర్క్ చేశారు. ఇక ఆ సమయంలోనే వీరు కమల్ కు కథ వినిపించడం, అది ఆయనకు నచ్చడంతో తానే స్వయంగా ప్రొడ్యూస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోలో కమల్ లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మామూలుగానే అన్బరివ్.. యాక్షన్ తో అదరగొడతారు. అలాంటిది వారే డైరెక్టర్స్ గా మారితే.. ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో కమల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version