NTV Telugu Site icon

Yash on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీపై కేజీఎఫ్ మూవీ స్టార్ యశ్ ప్రశంసల వర్షం..

Kalki

Kalki

KGF Star Yash on Kalki 2898 AD: రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో మహానటి ఫేమ్ నాగ అశ్విన్ డైరెక్ట్ చేసిన మూవీ “కల్కి 2898 ఏడీ”. ప్రియాంక దత్, స్వప్న దత్ తో కలిసి అశ్విని దత్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. క‌మ‌ల్‌హాస‌న్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్‌, దీపికా పదుకొణె లాంటి స్టార్స్‌ కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య గురువారం (జూన్‌ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్టుగా దూసుకుపోతుంది.ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 191.50 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కల్కి రికార్డు క్రియేట్ చేసింది.

Also Read: Kalki 2898 AD: “కల్కి 2898 ఏడి”తో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్

దీనికితోడు అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా శుక్రవారం (జూన్ 28) కేజీఎఫ్ స్టార్ యశ్ కూడా స్పందించాడు. “విజువల్ గా ఓ అద్భుతమైన సరికొత్త లోకముని క్రియేట్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్ కు నాశుభాకాంక్షలు. మరింత క్రియేటివ్ గా స్టోరీలు చెప్పడానికి ఈ సినిమా ఒక దారి చూపిస్తుంది. మరింత మంది ఓ పెద్ద అడుగు వేసేలా నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ విజన్ స్ఫూర్తిగా నిలవనుంది. డార్లింగ్ ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్ సర్, కమల్ హాసన్ సర్, దీపికా పదుకోన్, ఇతర అతిథి పాత్రలను కలిసి చూడటం ఎంతో అద్భుతమైన అనుభవం. ఇది నిజంగా స్క్రీన్ ను మరింత ఆనందింప చేసింది” అని యశ్ ట్వీట్ చేయడం విశేషం. రానున్న నాలుగు రోజుల లాంగ్ వీకెండ్‌లోకావడంతో కల్కి 2898 AD రూ. 500 కోట్ల వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.