Yash: కెజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా యష్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక యష్ వ్యక్తిగత విషయాలకొస్తే.. చిన్న కుటుంబం. భార్య.. ఇద్దరు పిల్లలు. షూటింగ్స్ లేనప్పుడు ఈ హీరో తన చిన్నారులతో ఆడుకుంటూ కనిపిస్తాడు. కూతురు ఐరా, కొడుకు యథర్వ్ తో కలిసి సరదాగా ఆడుకుంటున్న వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. సాధారణంగా తండ్రులు ఎక్కువగా కుమార్తెలను, తల్లులు ఎక్కువ కుమారులను ప్రేమిస్తారు అనేది యూనివర్సల్ ట్రూత్. ఇక్కడ యష్ కుటుంబంలోనూ అదే జరిగింది.
యష్ కూతురు ఐరా తండ్రి పార్టీ కాగా కుమారుడు యథర్వ్ తల్లి రాధికా పార్టీ. ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా రాధికా చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో యథర్వ్, రాధికా ఒడిలో కూర్చొని.. డాడ్ బ్యాడ్ బాయ్.. మామ్ గుడ్ గర్ల్ అని చెప్పుకొంటూ వచ్చాడు. యష్ వెనుక నుంచి వీడియో తీస్తూ డాడ్.. గుడ్ బాయ్ అంటే నో డాడ్ బ్యాడ్ బాయ్ అని చెప్పేశాడు. మరి మమ్మీ అంటే.. మమ్మీ గుడ్ గర్ల్ అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే యథర్వ్ ఏడుస్తూ ఈ విషయం చెప్పడంతో యష్ కొడుకును మందలించడంతో ఈ విధంగా తండ్రి మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
యథర్వ్, యష్ ల మధ్య జరిగిన సరదా సంభాషణ ఎంతో ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా యథర్వ్ ముద్దు ముద్దు మాటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అవును నిజమే.. అబ్బాయి ఎప్పుడు అమ్మచాటు బిడ్డనే.. ఐరా ఎక్కడ.. యష్ ను సపోర్ట్ చేయడానికి రాలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక యష్ కెజిఎఫ్ 2 తరువాత కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. త్వరలోనే యష్ కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ స్టార్ డైరెక్టర్ తో యష్ కలవనున్నాడో చూడాలి.
Radhika Pandit Instagram Post: