KGF Chapter 2 వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రాఖీ భాయ్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. ఇప్పటికే నెలకొన్న పలు పాన్ ఇండియా రికార్డులను బద్దలు కొట్టే దిశగా ప్రశాంత్ నీల్ మ్యాగ్నమ్ ఓపస్ మూవీ దూసుకెళ్తోంది. ఒక్క కన్నడలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ “కేజీఎఫ్-2” సందడే కన్పిస్తోంది. ఈ సీక్వెల్ తో యష్ కు మరింతగా క్రేజ్ పెరిగింది. అయితే యష్ “కేజీఎఫ్ 2”, విజయ్ “బీస్ట్” చిత్రాలు కేవలం ఒక్కరోజు గ్యాప్ తో పోటాపోటీగా విడుదలైన విషయం తెలిసిందే. తమిళనాడులో “బీస్ట్” ప్రభంజనం ఓ రేంజ్ లో ఉంటుందని భావించిన అభిమానులకు షాక్ తగిలింది. ‘బీస్ట్’ సినిమా ఘోరంగా పరాజయం పాలయ్యింది. దీంతో తమిళనాడులో “కేజీఎఫ్-2″కు గట్టి పోటీని ఇస్తాడనుకున్న ‘బీస్ట్’ సైలెంట్ గా పక్కకు తప్పుకున్నాడు.
Read Also : Hanuman Jayanthi : హనుమతో చెర్రీ… థ్రిల్లింగ్ వీడియో షేర్ చేసిన చిరు !
దీంతో తమిళనాడులోనూ “కేజీఎఫ్-2” చాలా స్క్రీన్ లను ఆక్రమించేసింది. అక్కడ ‘బీస్ట్’కే ఎక్కువ థియేటర్లను కేటాయించినప్పటికీ జనాలు మాత్రం “కేజీఎఫ్-2″ను చూడడానికి ఎగబడుతున్నారు. తమిళనాడు అంతటా ఉన్న ఎగ్జిబిటర్‌లు ఇప్పుడు ‘బీస్ట్’ని తీసేసి “కేజీఎఫ్-2″ను మరిన్ని స్క్రీన్లలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారట. మొత్తానికి విజయ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళనాడులో రాఖీ భాయ్ “బీస్ట్”ని డామినేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
