Site icon NTV Telugu

Srinidhi Shetty : KGF బ్యూటీ భారీ డిమాండ్..!

Srinidhiy

Srinidhiy

ఒకే ఒక్క సినిమా.. అమ్మడి దశ, దిశను మార్చేసింది. ఫస్ట్‌ పార్ట్‌తో పెద్దగా గుర్తింపు రాకపోయినా.. కెజీయఫ్ చాప్టర్ టుతో మాత్రం శ్రీనిధి శెట్టికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అందుకే అమ్మడు భారీగా డిమాండ్ చేస్తోందట. అయితే అసలు ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయా.. లేక కెజియఫ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పబ్లిసిటీ స్టంట్ అప్లై చేస్తోందా.. ఇంతకీ అమ్మడు ఎంత డిమాండ్ చేస్తోంది..?

మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీనిధి శెట్టి.. ‘కేజీఎఫ్’ వంటి సెన్సేషనల్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చాప్టర్ వన్ కంటే.. కెజియఫ్ చాప్టర్ టులో ఇంపార్టెంట్ రోల్ పడడంతో.. ఒక్క చిత్రంతోనే శ్రీనిధి శెట్టి పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. దీంతో కన్నడతో పాటు మిగిలిన భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయట. అయితే ఈ బ్యూటీ మాత్రం తెలుగు, హిందీలో మాత్రమే అవకాశాల కోసం ఎదురు చూస్తోందట. పైగా మినిమం రేంజ్ హీరోలకు నో చెబుతు.. బడా హీరోలైతేనే చేస్తానని చెబుతోందట. అంతేకాదు.. అమ్మడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. రీసెంట్‌గా ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆమెని సంప్రదించగా.. దాదాపుగా 2 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. దాంతో అమ్మడిని లైట్ తీసుకుంటున్నారట మేకర్స్. అందుకే ఇప్పటివరకు ఆమె ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదని తెలుస్తోంది. ఆఫర్లు వెనక్కి వెళ్లిన సరే.. ‘కేజీఎఫ్’తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు.. భారీ ఆఫర్ కోసం ఎదురు చూస్తోందట ఈ బ్యూటీ. ప్రస్తుతం శ్రీనిధి కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ సరసన కోబ్రా అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఆగష్టు 11న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే అమ్మడు ఆకాశానికి నిచ్చెన వేసేలా ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమాలో.. శ్రీనిధి శెట్టినే హీరోయిన్‌గా తీసుకోవాలని కొందరు అభిమానులు డిమాండ్ చేస్తుండడం విశేషంగా మారింది.

Exit mobile version