Srinidhi Shetty : KGF బ్యూటీ భారీ డిమాండ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకే ఒక్క సినిమా.. అమ్మడి దశ, దిశను మార్చేసింది. ఫస్ట్ పార్ట్‌తో పెద్దగా గుర్తింపు రాకపోయినా.. కెజీయఫ్ చాప్టర్ టుతో మాత్రం శ్రీనిధి శెట్టికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అందుకే అమ్మడు భారీగా డిమాండ్ చేస్తోందట. అయితే అసలు ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయా.. లేక కెజియఫ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పబ్లిసిటీ స్టంట్ అప్లై చేస్తోందా.. ఇంతకీ అమ్మడు ఎంత డిమాండ్ చేస్తోంది..?
మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీనిధి శెట్టి.. ‘కేజీఎఫ్’ వంటి సెన్సేషనల్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చాప్టర్ వన్ కంటే.. కెజియఫ్ చాప్టర్ టులో ఇంపార్టెంట్ రోల్ పడడంతో.. ఒక్క చిత్రంతోనే శ్రీనిధి శెట్టి పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. దీంతో కన్నడతో పాటు మిగిలిన భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయట. అయితే ఈ బ్యూటీ మాత్రం తెలుగు, హిందీలో మాత్రమే అవకాశాల కోసం ఎదురు చూస్తోందట. పైగా మినిమం రేంజ్ హీరోలకు నో చెబుతు.. బడా హీరోలైతేనే చేస్తానని చెబుతోందట. అంతేకాదు.. అమ్మడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. రీసెంట్‌గా ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆమెని సంప్రదించగా.. దాదాపుగా 2 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. దాంతో అమ్మడిని లైట్ తీసుకుంటున్నారట మేకర్స్. అందుకే ఇప్పటివరకు ఆమె ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదని తెలుస్తోంది. ఆఫర్లు వెనక్కి వెళ్లిన సరే.. ‘కేజీఎఫ్’తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు.. భారీ ఆఫర్ కోసం ఎదురు చూస్తోందట ఈ బ్యూటీ. ప్రస్తుతం శ్రీనిధి కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ సరసన కోబ్రా అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఆగష్టు 11న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే అమ్మడు ఆకాశానికి నిచ్చెన వేసేలా ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమాలో.. శ్రీనిధి శెట్టినే హీరోయిన్‌గా తీసుకోవాలని కొందరు అభిమానులు డిమాండ్ చేస్తుండడం విశేషంగా మారింది.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!