Site icon NTV Telugu

Malavika Avinash: ఆసుపత్రి పాలైన ‘కెజిఎఫ్’ నటి.. దాన్ని ఈజీగా తీసుకోకండి అంటూ పోస్ట్

Malavaika

Malavaika

Malavika Avinash: కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నటి మాళవిక అవినాష్. రాఖీ బాయ్ గురించి తెలుసుకోవడానికి వచ్చిన జర్నలిస్ట్ గా ఆమె నటన అద్భుతం. సినిమా రిలీజ్ అయ్యాక ఆమెపైనే ఎక్కువ మీమ్స్ వచ్చాయి. ఇప్పటికి ఆమె మీమ్స్ ను ఉపయోగిస్తూ హీరోలకు ఎలివేషన్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారిన మాళవిక ఆసుపత్రి పాలయ్యింది. గత కొన్నేళ్లుగా ఆమె మైగ్రేన్ తో బాధపడుతుంది. దాన్ని ఈజీగా తీసుకోవడం వలన వ్యాధి ముదిరి ఆసుపత్రి పాలయ్యింది. ప్రస్తుతం ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. తనలా ఎవరు కాకూడదని, తన పరిస్థితిని వివరిస్తూ పోస్ట్ పెట్టింది.

Sanjay Dutt: సంజు భాయ్ బాగానే ఉన్నాడట.. కంగారు పడకండి

” మీలో ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలికగా తీసుకోకండి .. లేకపోతే నాలాగే హాస్పిటల్ బెడ్ పై ఉండాల్సి వస్తుంది. నేను మైగ్రేన్‌ సమస్య నుంచి బయటపడటం కోసం పనాడోల్, నెప్రోసిమ్‌తో పాటు సంప్రదాయ ఔషధం తీసుకున్నాను.
మైగ్రేన్‌ సమస్య ఉన్న వారు.. డాక్టర్‌ని సంప్రదించాల్సిందిగా” ఆమె సూచింది. ప్రస్తుతం మాళవిక చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారు ఆమె త్వరగా కోలుకోవాలని\ కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే మాళవిక ఇప్పటివరకు 50 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. కెజిఎఫ్ సినిమా తరువాత ఆమె రేంజ్ మారిపోయింది. ఎన్నో మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక సినిమాలే కాకుండా పలు బుల్లితెర రియాలిటీ షోస్ కు కూడా అంవె జడ్జిగా వ్యవహరించింది.

Exit mobile version