Site icon NTV Telugu

KGF 2 Ties Up With RCB : మేకర్స్ ప్లాన్ అదుర్స్… వీడియో వైరల్

Kgf2 with RCB

Kgf2 with RCB

“కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దానికి ముందు పాన్-ఇండియా సినిమాపై భారీ హైప్‌ని సృష్టించేందుకు మేకర్స్ విభిన్నంగా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టిని సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే దేశవ్యాప్తంగా కొచ్చి, ముంబై వంటి పలు ముఖ్యమైన నగరాల్లో ప్రెస్ మీట్లు నిర్వహించిన టీం రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయనున్నారు. ఈరోజు సాయంత్రం తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి 24 గంటల వ్యవధిలో ఆంధ్రాతో పాటు హైదరాబాద్ లోనూ ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు టీం. ఇక మరోవైపు “కేజీఎఫ్ : చాప్టర్ 2” మేకర్స్ తీసుకున్న మరో నిర్ణయం సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.

Read Also : Mahesh Babu : సితార ఫస్ట్ కూచిపూడి డ్యాన్స్… వీడియోతో మహేష్ శ్రీరామ నవమి విషెస్

“KGF 2” నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సినీ ప్రేమికులకు మరింత వినోదాన్ని అందించడానికి RCB టీమ్‌తో చేతులు కలిపింది. KGF 2 జట్టు ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో RCB ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌లను సినిమాలోని ఒక్కో పాత్రతో పోలుస్తూ పవర్ ఫుల్ గా చూపించింది. RCB టీమ్‌తో “KGF 2” సహకారం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కాగా హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

Exit mobile version