Site icon NTV Telugu

KGF 2 : బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్… తొక్కుకుంటూ పోతున్న రాఖీ భాయ్

KGF-2

KGF 2 కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ చెప్పినట్టుగా రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ పోతున్నాడు రాఖీ భాయ్. ఆయన వయోలెన్స్ కు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. ఇక ‘కేజీఎఫ్-2’ హిందీలో కొత్త చరిత్ర సృష్టించింది. ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ ఈరోజు అంటే విడుదలైన 5వ రోజు 200 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ‘బాహుబలి 2’ రికార్డును ‘కేజీఎఫ్-2’ బ్రేక్ చేసింది. ఈ రికార్డును క్రియేట్ చేయడానికి ‘బాహుబలి 2’ మూవీకి 6 రోజులు పట్టింది. ‘కేజీఎఫ్-2’ గురువారం రూ. 53.95 కోట్లు, శుక్రవారం రూ. 46.79 కోట్లు, శనివారం రూ. 42.90 కోట్లు, ఆదివారం రూ. 50.35 కోట్లు రాబట్టింది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే మొత్తం రూ.193.99 కోట్లు కొల్లగొట్టింది. భవిష్యత్తులో ఈ రికార్డ్‌ను ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.

Read Also : Ilayaraja : రాజ్యసభకు మ్యూజిక్ మాస్ట్రో ?

తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా అదే ఫామ్‌ను కొనసాగిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘కేజీఎఫ్ 2’ ఆదివారం రూ. 5.55 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 28.20 కోట్లు వసూలు చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో యష్ ప్రధాన పాత్రలో నటించారు. శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Exit mobile version