Site icon NTV Telugu

Kethika Sharma : కేతిక లక్ బాగుంది.. వరుసగా ఆఫర్లు..?

Kethika

Kethika

Kethika Sharma : హాట్ బ్యూటీ కేతిక శర్మ సుడి తిరిగింది. ఇన్నేళ్లుగా నానా తంటాలు పడుతున్న ఆమెకు ఇప్పుడు జోష్ వచ్చింది. ఆమె ఎంట్రీ ఇచ్చిన రొమాంటిక్ మూవా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దాని తర్వాత చేసిన సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి. వైష్ణవ్ తేజ్ తో చేసిన రంగ రంగ వైభవంగా మూవీ ప్లాప్ టాక్ సంపాదించుకుంది. దాని తర్వాత ఏకంగా పవన్ కల్యాణ్‌, సాయి ధరమ్ కలిసి నటించిన బ్రో మూవీలో కూడా చేసినా ఫలితం దక్కలేదు. ఈ మూవీ తర్వాత తనకు మంచి ఆఫర్లు వస్తాయని ఆశలు పెట్టుకుంది. కానీ అడియాశలు అయిపోయాయి. ఇక చాలా అంచనాలతో మొన్న వచ్చిన రాబిన్ హుడ్ లో ఏకంగా ఐటైం సాంగ్ చేసేసింది.

Read Also : Keeravani : పవన్ కళ్యాణ్ కార్చిచ్చు…ఎంత వాన పడినా ఆగేది లేదు!

ఆ మూవీ ప్లాప్ అయినా.. పాట మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. పైగా ఇందులో కేతిక డ్యాన్స్ పై కొంత కాంట్రవర్సీ నడవడంతో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. ఆమె అందాలు కూడా ఇందులో హైలెట్ అయ్యాయి. దీంతో మళ్లీ సినిమా అవకాశాలు పెరిగాయి. దీనికి తోడు మొన్న శ్రీ విష్ణుతో చేసిన సింగిల్ మూవీ మంచి హిట్ అయింది. ఇలా కలిసొచ్చిన క్రేజ్ తో వరుసగా సినిమాలు ఆఫర్లు పట్టేస్తోంది.

ఇప్పుడు రవితేజ-కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నారంట. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మరో మూవీ ఆఫర్ ఇచ్చారంట అల్లు అరవింద్. సాయిధరమ్ తేజ్ చేయబోయే ఓ మూవీ కోసం కూడా తీసుకుంటున్నారంట. ఇలా ఒక్క ఐటెం సాంగ్ తో మళ్లీ ఛాన్సులు కొట్టేస్తోంది ఈ బ్యూటీ.

Read Also : Pakistan: మరోసారి బయటపడ్డ పాక్ సైన్యం, ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధం!

Exit mobile version