Kerala launches India’s first government-owned OTT platform CSpace: దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ నడిపే ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘సి స్పేస్’ను కేరళ సర్కార్ ప్రవేశపెట్టింది. తిరువనంతపురంలోని కైరలీ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘సి స్పేస్’ను ప్రారంభించారు. ఈ క్రమంలో మలయాళ సినిమా ఎదుగుదలకు ఇదో కీలకమైన ముందడుగు అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వేడుకకు సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్ అధ్యక్షత వహించారు. జాతీయ అలాగే రాష్ట్ర అవార్డులు గెలుచుకున్న అలాగే గుర్తించదగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించబడిన మలయాళ చిత్రాలను ఈ సి స్పేస్‌లో ప్రదర్శించనున్నారు. కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (KSF DC) C స్పేస్ ని డెవలప్ చేసింది. పే-పర్ వ్యూ విధానంలో పనిచేసే సి స్పేస్, రూ.75తో సినిమా చూడొచ్చు. CSpaceలో ప్రసారం చేయడానికి 40 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌కి రూ. 40, 30 నిమిషాలకు రూ. 30 మరియు 20 నిమిషాలకు రూ. 20 వసూలు చేయడానికి ప్లాన్ చేశారు.
Sara Ali Khan: వరుస ప్రమోషన్స్ లో సారా అలీ ఖాన్ కి గాయాలు.. షాకింగ్ వీడియో!
ఇక ఈ వసూలు చేసిన మొత్తంలో సగం నిర్మాతకు అందుతుంది. C స్పేస్ యాప్‌ను ప్లే స్టోర్ అలాగే యాపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేఎస్‌ఎఫ్ డీసీ చైర్మన్ షాజీ ఎన్ కరుణ్ మాట్లాడుతూ లాభాల్లో పారదర్శకత, వీక్షకుల సంఖ్య, అత్యాధునిక సాంకేతికత సీఎస్‌స్పేస్ ప్రత్యేకతలు అని అన్నారు. నిర్మాతలు తమ సినిమాలను చూసే ప్రేక్షకుల మద్దతు ద్వారా వారి నిర్మాణ ఖర్చులను తిరిగి పొందే అవకాశాన్ని కల్పించడం కోసమే దీన్ని సిద్ధం చేశామని అన్నారు. ఇక KSFDC, C స్పేస్ కోసం చిత్రాలను ఎంపిక చేయడానికి మరియు ఆమోదించడానికి ఫిలిం మేకర్స్ సంతోష్ శివన్, శ్యామప్రసాద్, సన్నీ జోసెఫ్, జియో బేబీ, రచయితలు OV ఉష మరియు బెంజమిన్‌లతో సహా 60 మంది సభ్యుల క్యూరేటోరియల్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు C స్పేస్‌కు సమర్పించిన కంటెంట్ యొక్క కళాత్మక – సాంస్కృతిక విలువను అంచనా వేస్తారు. వారు సిఫార్సు చేసిన సినిమాలు మాత్రమే ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శించబడతాయి. తొలి దశలో 42 చిత్రాలను క్యూరేటర్లు ఎంపిక చేశారు. ఇందులో 35 ఫీచర్ ఫిల్మ్‌లు, 6 డాక్యుమెంటరీలు అలాగే 1 షార్ట్ ఫిల్మ్ ఉన్నాయి.
