ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారనే వార్త దేశంలో ప్రకంపనలు సృష్టిస్తే, కొందరు మాత్రం అగౌరవంగా స్పందించడాన్ని ఖండిస్తూ కేరళ సినీ దర్శకుడు అలీ అక్బర్ తనకు మతంపై నమ్మకం పోయిందని, తన భార్యతో కలిసి హిందూ మతంలోకి మారతానని అన్నారు. అంతకుముందు ఒక వీడియోలో జనరల్ బిపిన్ రావత్ మరణం గురించి పోస్ట్‌లపై నవ్వుతూ ఎమోజీలతో స్పందించిన వారి పట్ల అలీ అక్బర్ తన ధిక్కారాన్నిఅసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు మతంపై తనకు నమ్మకం పోయిందని బుధవారంనాడు ప్రకటించాడు. అంతేకాదు తాను ఇకపై ముస్లింగా ఉండబోనని, హిందువుగా మారతానని స్పష్టం చేశారు. ఇప్పుడు అక్బర్, ఆయన భార్య లూస్యమ్మ హిందువులుగా మారబోతున్నారు. అలీ అక్బర్ ఇప్పుడు రామసింహన్‌గా మారబోతున్నాడు. “రామసింహన్ కేరళ సంస్కృతికి కట్టుబడి హత్యకు గురైన వ్యక్తి… ఇప్పుడు అలీ అక్బర్‌ని రామ్ సింగ్ అని పిలుస్తారు. అది మంచి పేరు” అన్నాడు. రామసింహన్ కుటుంబం ఇస్లాం నుండి హిందూ మతంలోకి మారాక 1947లో హత్యకు గురయ్యారు.
Read Also : కూలెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి… లిస్ట్ లో ఏకైక భారతీయుడు జక్కన్నే !
జనరల్ రావత్ మరణ వార్తపై అవమానకరమైన ప్రతిచర్యలు రావడంతో అలీ అక్బర్ తన ఫేస్‌బుక్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. తన మతానికి చెందిన వ్యక్తుల నుంచి ఈ మూర్ఖత్వ చర్య మతం మారాలని నిర్ణయించునెంతలా ఆయనను ప్రభావితం చేసింది. పేస్ బుక్ కొత్త ఖాతా ఓపెన్ చేసి ద్వారా ఈ ప్రకటన చేశాడు ఆయన. అలాగే తన కూతుళ్లను మతం మారమని బలవంతం చేయనని, అది వారి ఇష్టానికే వదిలేస్తానని చెప్పాడు. అలీ అక్బర్ గతంలో బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ నాయకత్వంతో విభేదాల కారణంగా పదవికి రాజీనామా చేశారు. అక్బర్ 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన 1988 లో ఉత్తమ తొలి దర్శకుడిగా కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డును కూడా అందుకున్నారు.