NTV Telugu Site icon

Uppu Kappurambu: డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాబోతున్న కీర్తి సురేష్‌ ఉప్పు కప్పురంబు

Uppukappurambhu

Uppukappurambhu

UppuKappurambu Directly on OTT Platform: ప్రస్తుత సమయంలో ఓటీటీకి బాగా ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. ఒకప్పుడు థియేటర్స్ లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో చిన్న సినిమాలు వైపు పట్టించుకోని ఆడియన్స్ ఓటీటీ వచ్చినప్పటినుంచి చిన్న సినిమాలకి కూడా బాగా డిమాండ్ పెరిగింది. దీంతో మేకర్స్‌ సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ఇక ఈ మధ్య కాలంలో అయితే స్టార్స్ నటించిన సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ కూడా చేరింది. కీర్తి సురేష్‌ లేటెస్ట్ గ నటిస్తోన్న కొత్త చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. భోళా శంకర్ చిత్రం తర్వాత తెలుగు తెరకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన కీర్తి సురేష్ తాజాగా ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది. ఈ సినిమా పేరు ‘ఉప్పు కప్పురంబు’. టైటిల్‌కు తగ్గట్లే ఈ సినిమా కథాంశం వెరైటీగా ఉండనుందని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే మేకర్స్‌ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో కీర్తి సురేష్‌ పాల్గొంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

Also Read: Alanaati Ramachandrudu: ‘అలనాటి రామచంద్రుడు’ కూడా వచ్చేస్తున్నాడు

కాగా ఈ సినిమాలో సుహాస్‌ కూడా మరో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. నిన్నిలా నిన్నిలా మూవీతో దర్శకుడిగా మారిన అనిల్‌ శశి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే మేకర్స ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు.. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగులో సినిమాలు తగ్గించిన కీర్తి సురేష్‌.. తమిళంలో మాత్రం వరుస సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మొత్తం 3 సినిమాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది కీర్తి సురేష్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ తేరీ రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న బేబీ జాన్‌తో హిందీ ఇండ‌స్ట్రీకి పరిచయం కానుంది. దీంతో పాటు హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌లోనూ కీర్తి నటించనుంది అని సమాచారం.

Show comments