Site icon NTV Telugu

“సర్కారు వారి పాట”లో కీర్తి సరిగమలు

Keerthy-Suresh

Keerthy-Suresh

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటిస్తున్న తాజా కమర్షియల్ డ్రామా ‘సర్కారు వారి పాట’లో తన పాత్రతో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. కీర్తి సురేష్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి తన సొంత ట్యాలెంట్ ను బయట పెట్టబోతోంది. వెండితెరపై సరిగమలు పలికించి ప్రేక్షకులను అలరించబోతోందట. కీర్తి సురేష్ ప్రతిభావంతులైన నటి మాత్రమే కాదు, వయోలిన్ ను అద్భుతంగా వాయించే సంగీత విద్వాంసురాలు కూడా. కీర్తి వయోలిన్‌ను అందంగా వాయించి అభిమానులను ఆకర్షించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కీర్తి ‘సర్కారు వారి పాట’ కోసం వయోలిన్ వాయిస్తున్నట్లు సమాచారం.

Read Also : “పుష్ప” స్పెషల్ ఈవెంట్ కు స్పెషల్ ప్లాన్స్

‘సర్కారు వారి పాట’కి సంగీత స్వరకర్త అయిన థమన్ ఈ చిత్రంలో కీర్తి సురేష్ సంగీతంతో మ్యూజిక్ సర్ప్రైజ్ ఇస్తుంది అంటూ హింట్ ఇచ్చారు. ఆయన అభిమానుల్లో ఒకరు సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ తో సినిమాలో పాట పాడించడం గురించైనా అడగ్గా… కీర్తి సురేష్ దానికి తిరస్కరించిందని, కానీ ఆమె ఖచ్చితంగా వయోలిన్ వాయిస్తారు అని చెప్పుకొచ్చాడు. దీంతో కీర్తి సురేష్ వయోలిన్ వాయించడంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కీర్తి సురేష్ సంగీత ప్రతిభను ప్రమోషనల్ సాంగ్స్ లేదా మ్యూజికల్ బిట్ కోసం థమన్ ఉపయోగించనున్నారు అంటున్నారు. ‘సర్కారు వారి పాట’కు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 1న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Exit mobile version