సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం. మహేష్ బాబు తప్ప మిగిలిన టెక్నీషియన్స్ అందరు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. ఇక తాజాగా ఈ ఇంటర్వ్యూ సెషన్ లో కీర్తి సురేష్ కూడా భాగమైంది. మహేష్ బాబు గారితో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా షూటింగ్ సెట్ లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ను కీర్తి అభిమానులతో పంచుకుంది.
మహేష్ బాబు ఆన్ స్క్రీన్ కామెడీ టైమింగ్ గురించి మా అందరికి తెలుస.. ఆఫ్ స్క్రీన్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది అని కీర్తి ని అడుగగా మే మాట్లాడుతూ “మహేష్ బాబు గారితో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. సెట్ లో మహేష్ సర్ ఎప్పుడు సరదాగా ఉంటారు. ఓ సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు నా టైమింగ్ మిస్సయ్యి స్టెప్పులు మర్చిపోయాను. ఆ సమయంలో నా చెయ్యి ఆయన ముఖానికి రెండు సార్లు తగిలింది.. వెంటనే నేను సారీ చెప్పాను .. అయినా మూడోసారి గట్టిగా కొట్టినట్లు తగిలింది. దీంతో వెంటనే మహేష్ సర్ ‘ నేను ఏమైనా తప్పు చేశానా నీకు’ అని అనేశారు. సరదాగా తీసుకొని ఆయన అలా మాట్లాడం ఎంతో ఆశ్చర్యం వేసింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట్లో వైరల్ గా మారింది.