సాధారణంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్స్‌లో హీరోయిన్లు చాలా తక్కువగా మాట్లాడుతారు. అందరికీ నమస్కారలంటూ మొదలుపెట్టి, ఏవో రెండు ముక్కలు మాట్లాడేసి, చిత్రబృందానికి థాంక్స్ అని చెప్పి సైడ్ అయిపోతారు. కానీ, సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం కీర్తి సురేశ్ అలా చేయలేదు. సినిమాలో తాను పోషించిన అల్లరి పాత్ర తరహాలోనే, చిలిపిగా మాట్లాడుతూ అందరి మనసులు దోచేసింది. ఇదే సమయంలో దర్శకుడు పరశురామ్‌ని ఆటపట్టిస్తూ, ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్‌ని షేర్ చేసింది.
షూటింగ్‌లో అప్పుడప్పుడు తనని రష్మిక రష్మిక అంటూ పరశురామ్ పలుసార్లు పిలిచారని చెప్పిన కీర్తి.. భవిష్యత్తులో రష్మికతో సినిమా చేస్తున్నప్పుడు ఆమెని కీర్తి కీర్తి అంటూ పిలుస్తారా? లేదా? అనేది చూడాలనుందని చెప్పింది. దీంతో, ఆ వేదికపై ఒక్కసారిగా నవ్వులు పూశాయి. అనంతరం సినిమా గురించి మాట్లాడుతూ.. తనను కళావతి క్యారెక్టర్‌కు ఎంపిక చేసినందుకు, ఆ పాత్రని బహుమతిగా ఇచ్చినందుకు దర్శకుడికి ధన్యవాదాలు తెలిపింది. తాను మైత్రీ మూవీస్‌తో పని చేయాలని పలుసార్లు ప్రయత్నించానని, ఎట్టకేలకు ‘సర్కారు వారి పాట’తో ఆ కోరిక నెరవేరిందని తెలిపింది. కళావతి క్యారెక్టర్‌ని మదిలో నిలిచేలా చూపించిన డీఓపీ మదికి థాంక్యూ చెప్పింది.
తమన్‌ని స్టార్ ఆఫ్ ద స్టేజ్‌గా పేర్కొంటూ.. అతనితో కలిసి చేసిన రెండో సినిమా ఇదని చెప్పింది. భమ్ అఖండ లాంటి మాస్ నుంచి కళావతి లాంటి క్లాసిక్ దాకా సాగించిన నీ సక్సెస్‌ఫుల్ జర్నీకి హ్యాట్సాఫ్ అంటూ కీర్తి అతడ్ని ప్రశంసించింది. ఇక మహేశ్ గురించి మాట్లాడుతూ.. సెట్‌లో ఆయన టైమింగ్‌ని మ్యాచ్ చేయగలనా? డబ్బింగ్ చెప్తున్నపుడు ఆయన గ్లామర్‌కి సరితూగగలనా? అంటూ తాను టెన్షన్ పడ్డానంది. మహేత్‌తో కలిసి పని చేసినందుకు అదృష్టంగానూ, గర్వంగా ఫీల్ అవుతున్నానంది. అభిమానుల్ని ఉద్దేశిస్తూ.. మీరెప్పట్నుంచో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారని.. ఆయన ఉన్నారు, ఆయన విన్నారు, ఆయన మీ ముందుకొస్తున్నారంటూ ఈ సినిమాలోని డైలాగ్‌ని ఉచ్ఛరించింది.
ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ఎప్పుడూ సపోర్ట్‌గా నిలిచిందని, అందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానంది. మే 12వ తేదీన అభిమానులు పండగ చేసుకోవడం ఖాయమని, మీ నిరీక్షణకు ఫలితం కచ్ఛితంగా దొరుకుతుందని చాలా నమ్మకంగా చెప్పింది. చివరగా చిత్రబృందానికి థాంక్స్ చెప్తూ.. కీర్తి సురేశ్ తన ప్రసంగాన్ని ముగించింది.
