Site icon NTV Telugu

Keerthy Suresh : లవర్ వదిలేసింది… శర్వా కోసం బ్యాడ్ గా ఫీల్ అవుతున్నా…

Keerthy Suresh

శర్వానంద్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”తోమార్చి 4న థియేటర్లలోకి రాబోతున్నాడు. రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధాకర్ నిర్మించారు. ఆదివారం “ఆడవాళ్లు మీకు జోహార్లు” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా… ఈ వేడుకకు అతిథిగా హాజరైన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరో శర్వానంద్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముందుగా తనను ఈ వేడుకకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. తన ఫస్ట్ సినిమా డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వ ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపించింది. ఇక శర్వా గురించి మాట్లాడుతూ ఆయనను కలవడం ఇదే ఫస్ట్ టైం… కానీ ఆయన గురించి కొంచం బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ‘జాను’ సినిమాలో లవర్ ఆయనను వదిలేసి సింగపూర్ వెళ్ళింది. ఈ సినిమాలో ఆయనకు అసలు పెళ్లే కానివ్వట్లేదు. కనీసం నెక్స్ట్ సినిమాలో అయినా శర్వా రిలేషన్ తన లవర్ తో స్మూత్ గా సాగాలని కోరుకుంటున్నా అంటూ సరదాగా వ్యాఖ్యానించింది.

Read Also : Rashmika : శర్వాతో కష్టం… ఎంత ఇరిటేట్ చేసినా…!

Exit mobile version