NTV Telugu Site icon

Keerthy Suresh: ఇంత సైలెంటుగానా… ఇదేంటి అక్క?

Keerthy

Keerthy

Keerthy Suresh Radhika Apte Starrer Akka Web Series on the way: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న యష్ రాజ్ ఫిలిమ్స్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కి శ్రీ కారం చుట్టింది. సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ జోనర్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా ఒక వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు యష్ రాజ్ ఫిలిమ్స్. సినీ పరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తున్న నటీమణులు కీర్తి సురేష్, రాధికా ఆప్టే ఈ సిరీస్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పోటా పోటీగా నటించే వీరిద్దరూ కలిసి ‘అక్క’ అనే స్ట్రీమింగ్ ప్రాజెక్ట్‌తో అలరించబోతుండడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆదిత్య చోప్రా నిర్మాతగా ధర్మరాజ్ శెట్టి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తుండగా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సీక్రెట్‌గానే ఉంచుతున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

Kalasa Teaser: వాయమ్మో బిగ్‌బాస్‌ భానుశ్రీ ఏంట్రా ఇలా భయపెడుతోంది?

రీసెంట్‌గా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్‌ను వైఆర్‌ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ తమ మొదటి వెబ్ సిరీస్‌గా రూపొందించగా అందులో ఆర్.మాధవన్, కె.కె.మీనన్, దివ్యేందు శర్మ, బాబిల్ ఖాన్ తదితరులు కీలక నటించారు. 1984 భోఫాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించి రిలీజ్ చేయగా వరల్డ్ వైడ్ టాప్ టెన్ వెబ్ సిరీస్‌ల్లో ఒకటిగా నెట్‌ఫ్లిక్స్‌లో ఇది ట్రెండ్ అవుతుంది. వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన సెకండ్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్, ఇది మల్టీ సీజన్ సిరీస్. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌లో వాణీ కపూర్ ప్రధాన పాత్రలో నటించగా ట్రాన్స్‌జెండర్ పాత్రలో ఆమె నటనకు చాలా మంచి ప్రశంసలు దక్కాయి. వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా, జమీల్ ఖాన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది.