జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ‘మహానటి’తో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. ఆ తరువాత చాలా వరకు గ్లామర్ పాత్రలను దూరం పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. కేవలం కంటెంట్ బేస్డ్, లేడీ ఓరియెంటెడ్ లేదా తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటే తప్ప సినిమాలను ఒప్పుకోవడం లేదు. ‘మహానటి’తో వచ్చిన ఫేమ్ ను అలాగే కంటిన్యూ చేయాలనుకుంటోంది. అయితే దాని కోసం సోదరి పాత్రలకు కూడా ఓకే చెప్పడానికి వెనకాడడం లేదు. సీనియర్ హీరోలకు చెల్లెలిగా నటించడానికి కీర్తి ఓకే చెప్పడం మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. అందుకే అలాంటి పాత్రలన్నీ ఇతర హీరోయిన్లను వదిలేసి కీర్తి చెంతకు చేరుతున్నాయి. దాని ఫలితంగానే సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవిలకు సోదరిగా కనిపించే అవకాశం వరించింది కీర్తిని. అయితే ఆ పాత్రల కోసం పారితోషికం కూడా భారీగానే అందుకుంటోంది మన మహానటి.
Read Also : “పుష్ప” వీడియో లీక్… బన్నీ మాస్ ఫీస్ట్ కి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన “పెద్దన్న” ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. దాదాపు 150 కోట్ల వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచిన ‘పెద్దన్న’ సినిమాలో కీర్తి అందుకున్న పారితోషికం విషయమై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఆన్‌లైన్ మీడియా కథనాల ప్రకారం ‘పెద్దన్న’లో తన పాత్ర కోసం కీర్తి ఏకంగా 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంది. ఈ చిత్రంలో ఆమె రజనీకాంత్ సోదరిగా నటించడమే కాకుండా కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది మరి. ఇప్పటి వరకూ కీర్తి అందుకున్న అత్యధిక పారితోషికం ఇదేనట!!
