NTV Telugu Site icon

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి.. వాతలు పెట్టిన ఆమె తల్లి

Keerthy

Keerthy

Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెల్సిందే. తన చిన్ననాటి స్నేహితుడు అయిన వ్యక్తితో కీర్తి ప్రేమలో ఉందని, పదమూడేళ్ల నుంచి కొనసాగుతున్న వీరి ప్రేమ త్వరలోనే పెళ్లి వరకు రాబోతున్నదని పుకార్లు షికార్లు చేశాయి. ఇక మరోపక్క తమిళ్ హీరో విజయ్ తో కీర్తి ప్రేమాయణం సాగిస్తోందని, విజయ్, సంగీత ల మధ్య చిచ్చు పెట్టి అతడిని రెండో పెళ్లి చేసుకుంటుందని కోలీవుడ్ మొత్తం కోడై కూస్తోంది. అయితే ఈ పెళ్లి రూమర్స్ పై కీర్తి ఇప్పటివరకు స్పందించింది లేదు. ఇక తాజాగా ఈ రూమర్స్ పై కీర్తి సురేష్ తల్లి మేనక స్పందించింది. తన కూతురుపై రూమర్స్ క్రియేట్ చేసేవారిపై మండిపడుతూ వారికి వార్తలు పెట్టింది. కీర్తి సురేష్ పెళ్లి పై వస్తున్న వార్తలో ఏది నిజం కాదని చెప్పుకొచ్చింది.

” నా కూతురు పెళ్లి వార్తలు అన్ని అవాస్తవం.. ఆమె ఇప్పుడు తన కెరీర్ ను మాత్రమే ప్రేమిస్తోంది. ఏదైనా విషయం ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాం. ఇలాంటి తప్పుడు వార్తలు అభిమానులు నమ్మొద్దు. అసలు ఇలాంటి వార్తలు ఎవరు సృష్టిస్తున్నారో కూడా తెలియడం లేదు” అంటూ మండిపడింది. దీంతో ఈ వార్తలకు చెక్ పడినట్టే. ఇక కీర్తి కెరీర్ విషయానికొస్తే.. మహానటి తరువాత.. సర్కారు వారి పాట చిత్రంతో ఓ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం నాని నటించిన దసరా సినిమా లో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇది కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కుతున్న రివాల్వర్ రీటా అనే సినిమాలో సైతం కీర్తి నటిస్తోంది.

Show comments