Keerthy Suresh: అదే తప్పు చేసిన కీర్తి.. ఇక మానేస్తే బెటర్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keerthy Suresh: నేను శైలజ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా స్టార్ల సరసన నటించే అవకాశం అందుకుంది. ఇక మహానటి సావిత్రి బయోపిక్ అయిన మహానటి సినిమాలో నటించి.. జాతీయ అవార్డును అందుకుంది. అందరికి సావిత్రమ్మ అయిపోయింది. ఇక ఈ సినిమా తరువాత కీర్తికి తిరుగులేదు అనుకున్నారు అంతా.. కానీ, ఏ ముహూర్తాన అమ్మడు మహానటి చేసిందో .. ఆ తరువాత నుంచి ఒక హిట్ కూడా అందుకోలేకపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి చేతులు కాల్చుకుంది. బొద్దుగా ముద్దుగా ఉన్న బాడీని బక్కచిక్కిపోయేలా చేసి ముఖంలో కళను పోగొట్టుకుంది. ఇక ఆ తరువాత రజినీకాంత్ కు చెల్లెలిగా నటించి మరింత తప్పు చేసింది. పెద్దన్న సినిమాలో రజినీకి చెల్లెలిగా నటించింది. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.
Sathyaraj: బ్రేకింగ్.. బాహుబలి కట్టప్ప ఇంట తీవ్ర విషాదం
Also Read
హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో చెల్లెలిగా చేస్తే.. అలాంటి పాత్రలే వస్తాయి అని తెలిసి కూడా ఆమె ఆ పాత్రను చేసింది. అనుకున్నట్టుగానే ఆ తరువాత చిరుకు చెల్లెలి పాత్ర అంటూ భోళా శంకర్ వచ్చింది. సరే అప్పుడంటే.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వర్క్ అవుట్ కాలేదు.. రజినీ సినిమా కాబట్టి పేరు వస్తుంది అని అనుకోని ఉండొచ్చు. కానీ, భోళాకు ముందు కీర్తికి సర్కారు వారి పాట తో కమర్షియల్ హిట్ దక్కింది. అయినా కూడా ఆమె చిరుకు చెల్లెలిగా నటించి తప్పు చేసిందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ పాత్రను కీర్తి ఒప్పుకోకుండా ఉండాల్సింది అని అంటున్నారు. సినిమాలో చిరు- కీర్తి మధ్య సిస్టర్- బ్రదర్ సెంటిమెంట్ ఎంత బాగా పండినా.. హిట్ టాక్ లేదు కాబట్టి దీనివలన అమ్మడి కెరీర్ చిక్కులో పడినట్లే అవుతుంది అని చెప్పుకొస్తున్నారు. కీర్తి లో నటన అభిమానులు అందరు చూసిందే. మహానటి, వెన్నెల, చిన్ని లాంటి పాత్రలను అవలీలగా చేయగల కీర్తి.. ఇకనుంచి అయినా ఇలాంటి రొటీన్ సినిమాలు చేయకుండా ఉంటే బెటర్ అని సలహాలు ఇస్తున్నారు. మరి కీర్తి ముందు ముందు ఎలాంటి కథలను ఎంచుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!