Site icon NTV Telugu

Keerthy Suresh: కీర్తి సురేష్ పోస్ట్ వెడ్డింగ్ షూట్.. హాజరైన స్టార్ హీరోయిన్

Keerthy

Keerthy

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వెడ్డింగ్ వైబ్స్ ను ఎంజాయ్ చేస్తోంది.. పోస్ట్ వెడ్డింగ్ షూట్ లో స్నేహితులతో కలిసి రచ్చ చేస్తోంది.. ఏంటీ కీర్తి అప్పుడే పెళ్లి చేసుకోబోతుందా..? వరుడు ఎవరు..? ఎక్కడ పెళ్లి..? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండి.. టైటిల్ ను చూసి కంగారుపడకండి.. ఎందుకంటే ఇది కీర్తి పెళ్లి కాదు.. ఆమె ఫ్రెండ్ పెళ్లి.. ‘సర్కారువారి పాట’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం విదితమే.. ఇక ఈ సక్సెస్ సెలబ్రేషన్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితురాలి పెళ్లి ఉండడంతో వెకేషన్ ను వదిలి సొంత గడ్డపై వాలిపోయింది. కేరళలో జరిగే పెళ్ళికి హాజరై.. రచ్చ రచ్చ చేసింది.

ఇక అమ్మడితో పాటు మరో స్టార్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని కూడా ఉండడం విశేషం.. ఇక ఏ పెళ్లిని బాగా ఎంజాయ్ చేసిన వీరందరూ పెళ్లి తరువాత పోస్ట్ వెడ్డింగ్ బ్లాస్ట్ పేరుతో హంగామా చేశారు.. స్నేహితురాళ్ల అందరితో కలిసి మహానటి ఫోటోషూట్ పెట్టేసింది.ఆ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ” నా సొంత గడ్డ .. నా సొంత మనుషులు” అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక కీర్తి కెరీర్ విషయానికొస్తే చిరు తో కలిసి భోళా శంకర్ లో నటిస్తున్న కీర్తి ఈ సినిమా తరువాత నాని సరసన దసరా లో మెరవనుంది. మరి ఈ సినిమాలు అమ్మడికి ఎలాంటి హిట్ ను అందిస్తాయో చూడాలి.

Exit mobile version