ఈ ఏడాది లేడీ ఓరియెంట్ చిత్రాలు హీరోయిన్లకు పెద్దగా అచ్చిరాలేదు. అనుష్క, తమన్నాలకు ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు ఇమేజ్ డ్యామేజ్ చేస్తే.. రష్మిక ఓకే అనిపించుకుంది. మరీ మలయాళ కుట్టీ కీర్తి సురేష్ సంగతేంటీ?. పలుమార్లు చేతులు కాల్చుకున్నా.. కూడా ఉమెన్ ఓరియెంట్ చిత్రాలు చేయడం మానదా?.
టాలీవుడ్‌లో లేడీ ఓరియెంట్ చిత్రాలకు ఆదరణ తగ్గింది. అయినా తమ ప్రయత్నాలు ఆపలేదు కొంత మంది బ్యూటీస్. సీనియర్ భామలు అనుష్క ఘాటీతో వస్తే.. ఆడియన్స్ తిప్పికొట్టారు. తమన్నా ఓదెల-2లో పూర్తిగా మారిపోయి డివోషనల్ టచ్ ఇచ్చినా చూడలేదు. కాస్తో కూస్తో బెటర్ అనిపించింది రష్మిక. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యిందని సమాచారం. ఇక నెక్ట్స్ ఫ్రూవ్ చేసుకోవాల్సింది కీర్తి సురేష్ వంతు.
మహానటి తర్వాత లేడీ ఓరియెంట్ చిత్రాలు చేసి చేతులు కాల్చుకుంది మలయాళ కుట్టీ కీర్తి సురేష్. కరోనా ఎఫెక్ట్ వల్ల పెంగ్విన్ ఓటీటీలోకి వచ్చేసింది కానీ.. థియేటర్లలోకి వచ్చి ఉంటే కచ్చితంగా ప్లాప్ అయ్యి ఉండేదన్న టాక్ వచ్చింది అప్పట్లో. ఆ తర్వాత మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ చిత్రాలతో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు ఊపిరిపోద్దామని ట్రై చేసింది కానీ.. కంటెంట్ లేకపోయే సరికి బాక్సాఫీస్ దగ్గర బొమ్మలు బోల్తా పడ్డాయి. అయినా సరే మరోసారి ప్రయోగానికి రెడీ అయ్యింది.
Also Read: IND vs SA: 408 పరుగుల తేడాతో భారత్ ఓటమి.. సిరీస్ వైట్‌వాష్!
‘రివాల్వర్ రీటా’తో లేడీ ఓరియెంట్ చిత్రాలకు లైఫ్ ఇవ్వడంతో పాటు మామన్నన్ తర్వాత చూడని హిట్ కోసం కీర్తి ట్రై చేస్తుంది. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు కీర్తి దీనితో ఆపేస్తుంది అనుకుంటే పొరపాటు. అక్క అనే వెబ్ సిరీస్, తమిళంలో చేస్తున్న కన్నివీడి, తెలుగులో కమిటైనట్లుగా చెబుతున్న ఎల్లమ్మ కూడా ఈ కోవలోనిదేనని టాక్. రౌడీ జనార్థనాలో విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న కీర్తి.. రివాల్వర్ రీటాతో తన ఫ్లాప్స్ పరంపరకు బ్రేకులేస్తుందేమో?, ఫీమేల్ ఓరియెంట్ చిత్రాలకు ఊపిరిపోస్తుందేమో చూడాలి.
