Site icon NTV Telugu

keerthy suresh : ఒంటరిగా, హాట్‌గా రెచ్చిపోయిన కీర్తి..!

New Project (9)

New Project (9)

 

రీసెంట్‌గా వచ్చిన సర్కారు వారి పాట మూవీతో.. కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకుంది కీర్తి సురేష్. అయితే ఇప్పటి వరకు లేడీ ఓరియెంటేడ్ సినిమాలతోనే అలరించింది కీర్తి. దాంతో ఈ సినిమా కీర్తి కెరీర్‌కు ముందు.. ఆ తర్వాతగా మారిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించే ఈ ముద్దుగుమ్మ.. సర్కారు వారి పాటతో యూటర్న్ తీసుకుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన మురారివా పాటలో కీర్తి తన గ్లామర్‌తో మరింతగా కట్టిపడేసింది. అసలు ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కీర్తి గ్లామర్ డోస్ పెంచి.. వరుస ఫోటో షూట్స్‌తో గ్లామ‌ర‌స్‌ షో చేస్తూ.. కుర్ర‌కారు మతులు పోగొడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోను సర్కారు వారి పాటతో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ట్రై చేస్తోంది. అందుకే ట్రెండీ, ట్రెడిషనల్ డ్రెస్సులతో ఫాన్స్‌ని కట్టిపడేస్తోంది. అసలు ఈమె మహానటినేనా అనేంతలా మారిపోయింది అమ్మడు.

తాజాగా కీర్తి తనఇన్ స్టాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్ర తీరంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కీర్తి హాట్ హాట్ ఫోజులు అదుర్స్ అనేలా ఉన్నాయి. స్టైలిష్ గా కనిపిస్తూనే హాట్ నెస్‌తో ఆకట్టుకుంటోంది అమ్మడు. మొత్తంగా ప్రస్తుతానికి కీర్తి మాత్రం.. కమర్షియల్ ట్రాక్‌లో పడిందనే చెప్పొచ్చు. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికొస్తే.. మలయాళంలో టోవినో థామస్ తో కలిసి నటించిన ‘వాషి’ మూవీ.. జూన్ 17న విడుదల కానుంది. అలాగే తమిళ్‌లో మామన్నన్ అనే పొలిటికల్ థ్రిల్లర్ లో.. ఫహద్ ఫాసిల్ తో కలిసి నటిస్తోంది. ఇక తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దసరా’లో నటిస్తోంది. అలాగే మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న’భోళా శంకర్’ చిత్రంలో చిరు చెల్లెలిగా కనిపిస్తోంది. ఇవే కాదు కీర్తి ట్రాక్ మార్చడంతో.. కొన్ని కమర్షియల్ సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు కళావతి ఫుల్ జోష్‌లో ఉందని చెప్పొచ్చు.

Exit mobile version