Site icon NTV Telugu

Keerthy Suresh: మహానటి తర్వాత పూర్తిగా బ్లాంక్ అయ్యా

Keerthy Suresh

Keerthy Suresh

మహానటి సినిమాతో కీర్తి సురేశ్ కెరీర్ ఎలా మలుపు తిరిగిందో అందరికీ తెలుసు! అప్పటివరకూ అందరు హీరోయిన్లలాగే ఈమెను కన్సిడర్ చేసిన జనాలు.. మహానటి తర్వాత ఆ అందరి కంటే భిన్నంగా చూడడం మొదలుపెట్టారు. ఈమెపై ఎనలేని గౌరవం పెరిగింది. అలనాటి సావిత్రిని అచ్చుగుద్దినట్టు అద్భుత ప్రదర్శన కనబర్చడంతో.. ఈ తరం మహానటిగా కీర్తి గడించింది. ఇలా అనూహ్యమైన క్రేజ్ వచ్చినప్పుడు, ఎవ్వరైనా క్రేజీ ప్రాజెక్టులు చేయాలని అనుకుంటారు. కీర్తి కూడా అలాగే అనుకొని, తనకొచ్చిన ఫీమేల్-సెంట్రిక్ సినిమాల్ని చేసుకుంటూ పోయింది. కానీ, ఏదీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.

అటు.. చేసిన అరకొర కమర్షియల్ చిత్రాలు కూడా బోల్తా కొట్టడంతో, కీర్తికి ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. ఎంత తక్కువ కాలంలో మహానటిగా ఎదిగిందో, అంతే తక్కువ కాలంలో ఐరన్ లెగ్‌గా ముద్ర వేయించుకుంది. పరిస్థితి ఎక్కడిదాకా వచ్చింది.. కీర్తి ఉంటే కచ్ఛితంగా ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని జనాలు నమ్మేదాకా! ఇక కీర్తి ప్రస్థానం ఇలాగే సాగుతుందేమోనని జనాలు దాదాపు ఫిక్సయ్యారు. కానీ, ‘సర్కారు వారి పాట’తో ఆ నెగెటివ్ ముద్ర పూర్తిగా తొలగిపోతుందని కీర్తి నమ్మకంగా చెప్తోంది. తనని జనాలు ఎలాగైతే చూడాలనుకుంటున్నారో, తిరిగి తాను ఆ జోన్‌లోకి వచ్చేశానని, ఇకపై కమర్షియల్ జోనర్‌లోనే సినిమాలు చేస్తానని తెలిపింది.

నిజానికి.. మహానటి లాంటి గొప్ప విజయం సాధించిన తర్వాత తనకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక మైండ్ బ్లాంక్ అయ్యిందని కీర్తి చెప్పింది. ఆ సమయంలో తనకు ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలే వచ్చాయని, కమర్షియల్ సినిమాల ఆఫర్స్ రాలేదని, అందుకే వాటిని చేశానని తెలిపింది. అయితే, ఆ సినిమాలు చేసినందుకు తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవని, ఫలితాలతో సంబంధం లేకుండా తాను మనస్ఫూర్తిగా ఆ చిత్రాల్ని చేశానని కీర్తి క్లారిటీ ఇచ్చింది. తాను అలాంటి సినిమాలు కావాలని కోరుకోలేదని, అవే తన వద్దకు వచ్చాయని, అలా వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది.

నిజానికి.. కమర్షియల్, ప్రయోగాత్మక చిత్రాల్ని బ్యాలెన్స్ చేయాలని తాను ప్రయత్నించానని, కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయానంది. ఇప్పుడైతే తాను ఎక్కువగా కమర్షియల్ చిత్రాలపై దృష్టి పెడుతున్నానని చెప్పిన కీర్తి.. తన పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు చెప్పినట్టు కచ్ఛితంగా ‘సర్కారు వారి పాట’ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని కీర్తి చెప్పింది. సాధారణ కమర్షియల్ చిత్రాలతో పోలిస్తే, ఇందులో తన పాత్ర చాలా విభిన్నమైందని, అందుకే ఇది తనకు స్పెషల్ సినిమా అని చెప్పింది. ఇక మహేశ్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని కీర్తి చెప్పుకొచ్చింది.

Exit mobile version