Keerthi Pandian: వరదల్లో చిక్కుకున్న కొత్త జంట.. ప్రభుత్వం పై నిందలు వేసిన హీరోయిన్ కీర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keerthi Pandian: చెన్నై సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను తాజాగా వచ్చిన తుఫాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చెన్నై నగరం చాలావరకు నీట మునిగింది. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించి చాలా వరకు రక్షణ చర్యలు చేపట్టింది. అయితే కొద్దిరోజుల క్రితమే తమిళ సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ కుమార్తె కీర్తి పాండియన్, యువ నటుడు అశోక సెల్వన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత ఈ కొత్త జంట చెన్నైలోని మైలాపూర్ పరిధిలోని డాక్టర్ రాధాకృష్ణన్ రోడ్ లో కొత్త జీవితం ప్రారంభించారు. అయితే కొత్తగా వివాహం జరిగిన ఈ జంటకు ఈ తుఫాను ఒక ఊహించని షాక్ ఇచ్చింది.
అదేమిటంటే చెన్నైలోని చాలా ప్రాంతాలానే ఈ జంట నివాసం ఉంటున్న ప్రాంతాన్ని కూడా వరద నీరు ముంచెత్తింది. వీరు కనీసం బయటికి కూడా రాలేని పరిస్థితిలలో రెండు రోజులపాటు ఆ వరద నీటిలో చిక్కుకున్న ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామూలుగా అయితే రెస్క్యూ టీమ్ వారిని గుర్తించి ముందుగా ఆహార అందించి తర్వాత రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. కానీ, ఆ రెస్క్యూ టీమ్ కూడా వీరిని రెండు రోజులు తర్వాతే గుర్తించి రక్షించారట. ఈ విషయాన్ని కీర్తి స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ వరదల వల్ల తాను, తన భర్త ఎన్నో ఇబ్బందులు పడ్డామని ఆమె వెల్లడించింది. అంతేకాదు ఈ వరదకు కారణం తుఫాను కాదని, ప్రభుత్వానిదే తప్పని అంటూ ఆమె ఆరోపణలు చేసింది. ఒకప్పుడు తామున్న ప్రాంతంలో ఎంత పెద్ద వర్షం పడిన ఒక చుక్క నీరు నిలిచేది కాదు అని, కానీ ఇప్పుడు చుట్టుపక్కల రోడ్లన్నీ ఇష్టానుసారం తవ్వేసి అసంపూర్తిగా వదిలేయడం వల్ల సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇలా వరదలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Raviteja : 'ఇరుముడి' రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
- Nana Patekar Slap Incident : నానాపటేకర్ నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
- NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
- Drishyam 3 Hindi Version : 'దృశ్యం 3' హిందీ వెర్షన్ లో భారీ మార్పులు... రీజన్ ఇదేనా ?
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!